చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విద్యార్థి ఆత్మహత్య, దాన్ని రికార్డు చేసిన వెబ్ కామ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Suicide
చెన్నై: తన లాప్‌టాప్‌లోని వెబ్ కామ్ రికార్డు చేస్తుండగా పదకొండో తరగతి విద్యార్థి తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో బుధవారం జరిగింది. వీడియోను ఓపెన్ చేయడానికి పోలీసులు ప్రయత్నించారు. అయితే టైమ్ లాగ్ కావడంతో పాస్‌వర్డ్ లేకుండా అది తెరుచుకోవడం లేదు.

ఆన్‌లైన్‌లో ఏమైనా సూసైడ్ నోట్ పోస్టు చేశాడా అనే విషయాన్ని తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్సిస్తున్నారు. ఆన్‌లైన్‌లో అతను ఎవరితోనైనా చాట్ చేస్తూ ఉండి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అన్నా నగర్‌లోని పాఠశాలలో చదువుతున్న 14 ఏళ్ల సుదర్ ప్రభు తన గదికి లోపలి నుంచి గడియ పెట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇటీవలి త్రైమాసిక పరీక్షల్లో అతను నాలుగు సబ్జెక్టులు తప్పాడు. గురువారం తల్లిదండ్రులను తీసుకుని రావాలని పాఠశాల అధికారులు అతనికి చెప్పారు. విషయం తెలిస్తే తల్లిదండ్రులు కొడతారనే భయంతో అతను ఉరేసుకుని మరణించినట్లు తెలుస్తోంది. నిస్పృహతో కనిపించిన కుమారుడిని తల్లి భానుమతి ఉదయమే అందుకు గల కారణం అడిగింది. ఆ తర్వాత అతను గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు.

తల్లి భానుమతి ఎంతగా తట్టినా తలుపులు తెరుచుకోకపోవడంతో కిటికీలోంచి చూసింది. విషయాన్ని కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ అయిన తన భర్త సుబ్బరాయులుకు చెప్పింది. అతను పోలీసులకు సమాచారం అందించాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకోవడానికి సుందర్ ప్రభు మిత్రులతో మాట్లాడుతున్నట్లు పోలీసులు తెలిపారు. లాప్‌టాప్‌ను తాము స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

English summary
A Class XI student committed suicide by hanging himself at his house in Chennai's Villivakkam on Wednesday, with the webcam on his laptop recording it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X