పవన్: ఖబర్దార్ అంటూ టిఅర్ఎస్ నిప్పులు, హెచ్చార్సీకి

 Telangana Rastra Samithi
హైదరాబాద్: కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రంపై తెలంగాణ రాష్ట్ర సమితి శుక్రవారం నిప్పులు చెరిగింది. ఈ చిత్రం తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చేలా తీశారని ఆ పార్టీ నేతలు శ్రవణ్ కుమార్, సుమన్ తదితరులు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండిపడ్డారు. కలెక్షన్లకు ప్రజా ఉద్యమాన్ని ఉపయోగించుకుంటే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అభ్యంతరకర సన్నివేశాలు తొలగించాలని డిమాండ్ చేశారు.

హీరో పవన్ కల్యాణ్, దర్శకుడు పూరీ జగన్నాథ్ ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. ఈ సినిమాకు పాపపు పవన్ కల్యాణ్‌తో అడ్డగాడిద పూరీ జగన్నాథ్ సినిమా తీశాడని పేరు పెడితే బాగుండేదని మండిపడ్డారు. సామాజిక స్పృహ కలిగి ఉన్నానని చెప్పుకునే పవన్ కల్యాణ్‌కు ఉద్యమాన్ని కించపర్చడమే మంచిగా కనిపిస్తుందా అని ప్రశ్నించారు. ఒళ్లు బలిసి, పైసల పైత్యంతో, తల పొగరెక్కి ఈ చిత్రం తీసినట్లుగా కనిపిస్తోందని నిప్పులు చెరిగారు.

తెలంగాణ ఉద్యమాన్ని సినిమాలు తీస్తే ఊరుకునేది లేదన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ వచ్చాక సినిమా పరిశ్రమకు పెద్ద పీట వేయాలని చూస్తుంటే సిని పరిశ్రమ వారు ఇలా చేయడమేమిటని ప్రశ్నించారు. దర్శకుడు, హీరో, నిర్మాతలు తెలంగాణ ద్రోహులన్నారు. మా భూములను దోచుకొని మా తెలంగాణను కించపరుస్తారా అని ప్రశ్నించారు. మీ తిక్క ఉంటే మీ పైత్యాన్ని ఇంట్లో పెట్టుకోండని కానీ తమ ప్రాంతంపై చూపిస్తే మంచిది కాదన్నారు.

ఈ గడ్డమీద పుట్టి దిల్ రాజు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఒళ్లు దగ్గర పెట్టుకొని తీయాలన్నారు. రెచ్చగొట్టే వాతావరణాన్ని సృష్టించేందుకు ఈ సినిమా తీశారా అని ప్రశ్నించారు. అడ్డమైన సినిమాలతో తెలంగాణ ఉద్యమాన్ని కించపరుస్తారా అన్నారు. ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని లేదంటే బట్టలూడదీసి కొడతామన్నారు. తాము ఎప్పుడూ సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేయలేదని, చేస్తే ఎవరూ బతకలేరన్నారు.

దిల్ రాజు మాట్లాడారు.. కెటిఆర్

దిల్ రాజు తనతో మాట్లాడారని తెరాస సిరిసిల్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. దర్శకుడు పూరీ జగన్నాథ్ తెలంగాణవాదులతో కయ్యానికి కాలు దువ్వుతున్నారని మండిపడ్డారు. జరగబోయే పరిణామాలకు తాము ఏమాత్రం బాధ్యులం కాదన్నారు. సినిమా ఇండస్ట్రీని తాము ఎప్పుడూ టార్గెట్ చేయలేదని చెప్పారు. కాగా ఈ సినిమాను బ్యాన్ చేయాలని తెలంగాణ న్యాయవాదులు హెచ్చార్సీని ఆశ్రయించారు.

కాంగ్రెసు పార్టీ ముఖ్యనేత, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి తెలంగాణకు అలా మోసం చేస్తే పవన్ కల్యాణ్ ఇలా చేశారని టిఆర్ఎస్ శ్రేణులు ధ్వజమెత్తారు. తాము ఈ సినిమాను చూసే ప్రసక్తి లేదన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చి లాభాలు గడించాలనుకుంటే చూస్తూ ఊరుకోమన్నారు. దీనిని తెలంగాణవ్యాప్తంగా అడ్డుకుంటామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+