వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భువనేశ్వరి, లోకేష్ పూజలు: వారు జైలుకెళ్లారన్న బాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Bhuvaneswari-Chandrababu Naidu
మహబూబ్‌నగర్/ కర్నూలు: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి, తనయుడు నారా లోకేష్ శనివారం మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్ జోగులాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వస్తున్నా.. మీకోసం పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు ఆరోగ్యం కోసం పూజలు చేశామని వారు చెప్పారు. కర్నూలు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు ఈ నెల 22వ తేదీన మహబూబ్‌నగర్ జిల్లా ద్వారా తెలంగాణలో అడుగు పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో భువనేశ్వరి, లోకేష్ జోగులాంబ ఆలయంలో పూజలు చేశారు.

చంద్రబాబు శనివారం 19వ రోజు తన పాదయాత్రను కర్నూలు జిల్లా కంపాడు నుంచి ప్రారంభించారు. అక్కడ ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గత వారం రోజులుగా ఆయన కర్నూలు జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. ఈ నెల 22వ తేదీ వరకు కర్నూలు జిల్లాలో ఆయన పాదయాత్ర సాగుతుంది.

వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో దోచుకున్న నాయకులు, అధికారులందరూ జైలుకెళ్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పెద్దల తప్పుడు నిర్ణయాలతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన అన్నారు. అవినీతిపరుల వల్ల ప్రజలపై మోయలేని భారం పడుతోందని అన్నారు. ప్రజలకు కనీసం మంచినీరు కూడా అందించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు.

పంచాయతీ సిబ్బంది లేకపోవడంతో గ్రామాల్లో అంటువ్యాధులు, విషజ్వరాలు ప్రబలుతున్నాయని చంద్రబాబు అన్నారు. నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయాయని, రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలోనే యువతకు ఎక్కువ ఉద్యోగాలు కల్పించామని ఆయన చెప్పుకున్నారు. ఆయన వెంట నారా లోకేష్, బావమరిది రామకృష్ణ ఉన్నారు.

English summary
Telugudesam party president N Chandrababu Naidu's wife Bhuvaneswari and son Nara Lokesh performed pujas at Alampur Jogulamba temple in Mahaboobnagar district. Chandrababu padayatra will reach Mahaboobnagar on october 22.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X