వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైకమాండ్ పెద్దలతో భేటీలు, తెలంగాణ మంత్రులు బిజీ

By Pratap
|
Google Oneindia TeluguNews

K Jana Reddy
న్యూఢిల్లీ: తమ కాంగ్రెసు పార్టీ అధిష్టానం పెద్దలను కలుస్తూ తెలంగాణకు చెందిన రాష్ట్ర మంత్రులు శనివారం బిజీగా ఉన్నారు. తెలంగాణ అంశంపై ఒత్తిడి తెచ్చేందుకు తెలంగాణ మంత్రులు ఢిల్లీకి చేరుకున్నారు. మంత్రులు కె. జనారెడ్డి, బస్వరాజు సారయ్య, శ్రీధర్ బాబు శనివారంనాడు కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌ను, ప్రత్యేక పరిశీలకుడు వాయలార్ రవిని కలుసుకున్నారు.

తెలంగాణపై కేంద్రం నుంచి ప్రకటన రాకపోతే తాము నియోజకవర్గాల్లో తిరిగే పరిస్థితి లేదని వారు చెప్పుకున్నారు. వారి నివేదనకు వాయలార్ రవి, ఆజాద్‌ల నుంచి ఒకే రకమైన సమాధానం లభించినట్లు తెలుస్తోంది. తెలంగాణపై తమకు అంతా తెలుసునని వారు చెప్పారు. తెలంగాణ అంశంపై ఢిల్లీకి రావడం వల్ల ప్రయోజనం ఉండదని వారు మంత్రులకు సూచించినట్లు తెలుస్తోంది.

ఢిల్లీకి రావడం విమానం ఖర్చులు వృధా అవుతాయని వారు అన్నట్లు ప్రచారం జరుగుతోంది. పనిలో పనిగా తెలంగాణ మంత్రులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై అధిష్టానం పెద్దలకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహార శైలి వల్ల రాష్ట్రంలో పార్టీ తీవ్రంగా నష్టపోతుందని వారు చెప్పారు.

వాయలార్ రవిని, ఆజాద్‌ను కలిసిన తర్వాత తెలంగాణ మంత్రులు రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డితో సమావేశమయ్యారు. తెలంగాణకు చెందిన నలుగురు మంత్రులు మాత్రమే ఢిల్లీకి రావడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ మంత్రుల్లో ఐక్యతను కిరణ్ కుమార్ రెడ్డి దెబ్బ తీస్తున్నారని వారు గుర్రుమంటున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ మార్చ్ ప్రశాంతంగా జరగడానికి తామే కారణమని వారు కేంద్ర మంత్రులకు చెప్పుకున్నట్లు తెలుస్తోంది. మిలియన్ మార్చ్ అనుమతుల విషయంలో చొరవ చూపి పరిస్థితి పార్టీకి వ్యతిరేకం కాకుండా చూశామని వారు చెప్పారు.

English summary
Ministers from Telangana region K Jana Reddy, Baswaraju Saraiah, Sudarshan Reddy and Sridhar Babu met Congress high command leaders Vayalar Ravi and Ghulam Nabi Azad on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X