ఇవ్వాల్సింది కేంద్రమే: తెలంగాణపై వైయస్ విజయమ్మ

తెలంగాణలో అనేక మరణించారని, తెలంగాణలోని మరణాలకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆమె అన్నారు. ప్రాణాలు పోయేంత వరకు తెలంగాణను వైయస్ రాజశేఖర రెడ్డి ప్రేమించారని చెప్పారు. ఇక్కడి కష్టాలు వైయస్ రాజశేఖర రెడ్డికి తెలుసునని, తెలంగాణ వెనుకబాటును గుర్తించారని ఆమె అన్నారు. ఈ ప్రాంతానికి చేయాల్సినంత వైయస్ రాజశేఖర రెడ్డి చేశారని అన్నారు. రాజశేఖర రెడ్డికైనా, వైయస్ జగన్‌కైనా తెలంగాణ పట్ల వ్యతిరేకత లేదని విజయమ్మ అన్నారు.
మనిషిని మనిషిగా ప్రేమించడమే వైయస్ రాజశేఖర రెడ్డి నేర్పించారని, అందరూ కలిసి ఉండాలని ఆశించారని, ఎవరినీ నొప్పించే ఉద్దేశం వైయస్‌కు లేదని ఆమె అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను తాము గౌరవిస్తామని చెప్పారు. అందుకే తెలంగాణ కోసం రాజీనామాలు చేసినవారిపై తమ పార్టీ పోటీ పెట్టలేదని గుర్తు చేశారు. ఈ ప్రాంత ప్రజల అభిప్రాయాలకు గౌరవం ఇచ్చే తాము పోటీ పెట్టలేదని అన్నారు.
తాము తెలంగాణకు వ్యతిరేకులం కాదని పార్టీ ప్లీనరీలో కూాడ స్పష్టం చేశామని అన్నారు. ఏ ఒక్కరి మనోభావాలు దెబ్బ తినకుండా కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆమె అన్నారు. ఎవరో చేసిన పాపాలను దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డిపై వేస్తున్నారని నల్లగొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి అన్నారు. వైయస్ జగన్ కడపలో భారీ మెజారిటీతో గెలిచారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీదే అధికారమని ఆయన అన్నారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications