కృష్ణవేణి ఆత్మహత్య కేసులో ఐదుగురి అరెస్టు

ఈ నెల ఒకటవ తేదీన ఎసి జి.కృష్ణవేణి సికింద్రాబాదులో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కొన ఊపిరితో ఉన్న ఆమెను సికింద్రాబాదులోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ లోపే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే, తనను మానసికంగా పాలకవర్గం, సిబ్బంది వేధిస్తున్నారని సూసైడ్ నోట్‌లో పేర్కొంది.
ప్రధానంగా ఛైర్మన్ రంగా బాలకృష్ణ, పాలక వర్గ సభ్యులు మర్రి సత్యనారాయణ, ఆలయానికి చెందిన ఉద్యోగి పెద్ద వేణు, అర్చకులు తనపట్ల అసభ్యంగా వ్యవహరిస్తున్నారని, మానసికంగా క్షోభకు గురి చేస్తున్నారని కృష్ణవేణి ఆరోపించింది. కృష్ణవేణి ఆత్మహత్య సంఘటనపై సికింద్రాబాదులోని మార్కెట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
ఈ కేసులో పాలకమండలి ఛైర్మన్ రంగా బాలకృష్ణ, సభ్యులు మర్రి సత్యనారాయణ, ఉద్యోగి పెద్ద వేణుగోపాలాచారి (పెద్దవేణు), అర్చకులైన పాపాచార్యులు, మణికంఠలను అరెస్టుచేసి హైదరాబాద్ తరలించారు.












Click it and Unblock the Notifications