మాతో వస్తే కష్టాలు: విజయమ్మ, జగన్ పార్టీలోకి వనిత

వాటిని భరించక తప్పదని, అన్నింటికి సిద్దపడాలని సూచించారు. ఇబ్బందులు ఉంటాయని తెలిసి వచ్చిన వారు పార్టీ కోసం గట్టిగా కృషి చేయాలన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఎప్పుడూ ప్రజల్లో ఉండేందుకు ఇష్ట పడేవారని, జగన్ కూడా ఆయనను ఆదర్శంగా తీసుకున్నారని, నేతలు కూడా అలాగే ఉండాలన్నారు. జగన్ అడ్డంకులు అధిగమించి బయటకు వస్తారని, ప్రజల మధ్య ఉంటారని, రాజన్న పాలన అందిస్తారన్నారు.
జగన్‌ను ముఖ్యమంత్రిగా చేయడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని కృష్ణబాబు అన్నారు. గతంలో టిడిపిలో ఎలాగైతే బాధ్యతలు తీసుకొని పని చేశానో 2014 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు కోసం కూడా అంతే పని చేస్తానన్నారు. ఎన్టీఆర్ టిడిపిని హుందాగా నడిపితే, చంద్రబాబు దాన్ని కులం, కుటుంబ పార్టీగా మార్చేశారని ధ్వజమెత్తారు. జగన్‌ను కేసుల్లో ఇరికించినా బయటకు వస్తారన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ పార్టీ 200 స్థానాలు గెలుచుకోవడం ఖాయమన్నారు.
తాను చాలాకాలంగా కమ్మ సామాజిక వర్గం కోటాలో రాజ్యసభ సీటు ఇవ్వాలని బాబును కోరుతూ వస్తున్నానని, కానీ ఎప్పుడూ అవకాశం కల్పించలేదన్నారు. సుజనా చౌదరికి సీటు ఇవ్వడం తనకు ఆగ్రహం తెప్పించిందన్నారు. డబ్బులు ఖర్చు చేసిన వారికే పదవులు కట్టబెడుతున్నారని విమర్శించారు. తనను పార్టీ నుండి అకారణంగా బహిష్కరించారని వనిత ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుండి నియోజకవర్గంలో ఓ వర్గం తనను నిత్యం వేధించడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు.












Click it and Unblock the Notifications