వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఖైదీ నెం.6093, ములఖాత్‌లతో వైయస్ జగన్ బిజీ

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: ఖైదీ నెంబర్ 6093 హైదరాబాదులోని చంచల్‌గుడా జైలులో విఐపి ఖైదీల్లోకెల్లా బిజీగా కనిపిస్తున్నారని సమాచారం. ఈ మేరకు ఓ ఆంగ్లదినపత్రిక ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. మొదటి అయిదు నెలల్లో 134 ములాఖత్‌లు జరిగినట్లు తెలుస్తోంది. ఆ విఐపి ఖైదీ ఎవరో కాదు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్.

వైయస్ జగన్‌కు చంచల్‌గుడా జైలు అధికారులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, నిబంధనలను కాలదన్ని ములాఖత్‌లకు అనుమతిస్తున్నారని గత కొంత కాలంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. వైయస్ జగన్ జైలులో సెల్ ఫోన్ కూడా వాడుతున్నట్లు వారు ఆరోపించారు. వైయస్ జగన్ మే 29వ తేదీన ఆరెస్టయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి సెప్టెంబర్ 27వ తేదీ వరకు ములాఖత్‌ల సందర్బంగా జగన్‌కు 134 ఇంటర్వ్యూలు జరిగినట్లు ఆంగ్లపత్రిక రాసింది.

వైయస్ జగన్‌ను శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులతో పాటు ఇతర పార్టీల నుంచి వలస రావడానికి సిద్ధపడిన నాయకులు కూడా జైలులో కలుస్తున్న సమాచారం ఎప్పటికప్పుడు బయటకు వస్తూనే ఉన్నది. చాలా వరకు వారానికి రెండు సార్లు మాత్రమే ములాఖత్‌లకు అనుమతిస్తున్నట్లు మాత్రం జైలు రికార్డులు చూపుతున్నాయి.

జగన్‌ ములాఖత్‌లపై సమాచారం కోసం సమాచార హక్కు చట్టం కింద తెలుగుదేశం పార్టీ నాయకుడు యనమల రామకృష్ణుడు దరఖాస్తు చేసుకున్నారు. 2011 సెప్టెంబర్ నుంచి జైలులో ఉన్న కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ములాఖత్‌లు 86 మాత్రమే. షర్మిల, తన బావ అనిల్ కుమార్ వైయస్ జగన్‌ను ఎనిమిది సార్లు జైలులో కలిసినట్లు సమాచారం. మిత్రుడిగా, మరికొన్ని సార్లు అనిల్ బాబుగా జైలు రికార్డుల్లో ఆయన ములాఖత్‌ను ప్రస్తావించారు.

జైలులో వైయస్ జగన్‌ను తల్లి వైయస్ విజయమ్మ, భార్య భారతి, సోదరి షర్మిలలతో పాటు 11 మంది కలిశారు. వారిలో కొంత మంది శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు ఉన్నారు. విజయమ్మ 19 సార్లు, భారతి 36 సార్లు, షర్మిల 9 సార్లు విజయమ్మను కలిశారు. సినీ నటుడు మోహన్ బాబు వైయస్ జగన్‌ను కలిశారు. అయితే, తాను నిమ్మగడ్డ ప్రసాద్‌ను కూడా కలిసినట్లు ఆయన తెలిపారు. నిమ్మగడ్డ ములాఖత్‌ల్లో మోహన్ బాబు పేరు లేదని ఆంగ్ల దినపత్రిక రాసింది.

English summary
According to an English daily - Qaidi No.6093 at Chanchalguda jail appears to be the busiest among all the prisoners as he had 134 'mulaqats' in the first five months of his stay in the jail, much higher than what was notched up by his 'VIP' co-prisoners. And qaidi No.6093 is none other than Kadapa MP and YSR Congress chief YS Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X