కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జడ్జిపై హెచార్సీకి రెండో భార్య ఫిర్యాదు: విచారణ

By Pratap
|
Google Oneindia TeluguNews

 Second wife complains against judge
హైదరాబాద్: తనను పెళ్లి చేసుకుంటే, మంచి జీవితం అందిస్తానని మాటలు చెప్పి, పెళ్లైయ్యాక మొహం చాటేస్తున్నాడంటూ ఓ వివాహిత జిల్లా స్థాయి న్యాయమూర్తిపై హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసింది. రత్నమ్మ అనే ఆ మహిళ చెప్పిన వివరాలు ప్రకారం - కర్ణాటక రాష్ట్రం, తుముకూరు జిల్లా పావుగడలో ఉండే రత్నమ్మకు తల్లిదండ్రులు లేరు. తన అక్క రాధమ్మ వద్ద ఉంటున్నది. వీరికి అనంతపురం జిల్లా హిందూపురం మునిసిపాలిటీ ఉన్నతాధికారి ప్రతాప్‌తో పరిచయం ఏర్పడింది.

రత్నమ్మను తన సోదరుడు కడప జిల్లా రాజంపేటలో అదనపు జడ్జిగా పనిచేస్తు న్న విజయచందర్ రాణాతో రెండో పెళ్లికి ప్రతిపాదించారు. ఆయ న మొదటి భార్య చనిపోయింది. రత్మమ్మను జడ్జికిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకున్నారు. అనంతపురంలో 2009, నవంబరు 5న పెళ్లి జరిగింది. 3 నెలల తర్వాత రత్నమ్మ గర్భవతి అవడంతో జడ్జి మొదటి భార్య కూతురు అభ్యంతరం చెప్పింది. అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి చేసింది. దానికి జడ్జి కూడా వత్తాసు పల్కడంతో వివాదం అయింది.

కొద్దిరోజుల్లోనే రత్మమ్మను జడ్జి ఆమె అక్క ఇంటి వద్ద వదిలేశారు. తర్వాత పెళ్లయ్యాక తన ఇంటి పత్రాలపై జడ్జి రూ.16 లక్షల అప్పు కూడా తీసుకున్నారని, దానికీ ఆయన సమాధానం చెప్పడం లేదు. తనకు జరిగిన అన్యాయంపై ఆమె పావుగడ పోలీసులకు చెప్పినా ఫలితం లేదని బాధితురాలు రతమ్మ హెచ్ఆర్‌సీ సభ్యుడు పెదపేరిరెడ్డిని కలిసి బోరుమంది.

జడ్జి విజయచందర్‌తో జరిగిన పెళ్లి ఫొటోల ఆల్బంను, రెండేళ్ల బిడ్డను కూడా ఆయనకు చూపించింది. స్పందించిన హెచ్ఆర్సీ, రత్నమ్మ ఉదంతంపై వాస్తవాలు పరిశీలించి డిసెంబరు 19 లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని కడప ఎస్పీని ఆదేశించింది. ఈ మేరకు ఫాక్స్‌లో ఆదేశాలు వెళ్లాయి.

English summary
A woman, went as a second wife to a judge, complained to the HRC on her husband. HRC ordered for an enquiry into the incident and asked to submit a report.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X