వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మజ్లీస్ ఫ్యాక్టర్: జిహెచ్ఎంసిపై కన్నేసిన జగన్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: కాంగ్రెసుకు మజ్లీస్ మద్దతు ఉపసంహరించుకున్న నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ (జిహెచ్ఎంసి)పై కన్నేసినట్లు తెలుస్తోంది. మజ్లీస్, కాంగ్రెసు ఒప్పందానికి వచ్చి ఇప్పటి వరకు జిహెచ్ఎంసి అధికారాన్ని పంచుకుంటున్నాయి. మజ్లీస్ కాంగ్రెసుకు మద్దతు ఉపసంహరించుకున్న నేపథ్యంలో సమీకరణాలు మారే సూచనలు కనిపిస్తున్నాయి.

కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ కార్పోరేటర్లను వైయస్సార్ కాంగ్రెసు నాయకులు దువ్వుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఐదుగురు కార్పోరేటర్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. వీరిలో నలుగురు కాంగ్రెసు పార్టీకి చెందినవారు కాగా, ఒకరు తెలుగుదేశం పార్టీకి చెందిన కార్పోరేటర్. ఈ రెండు పార్టీలకు చెందిన కార్పోరేటర్లు 15 నుంచి 20 మంది దాకా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. వారు ఏ సమయంలోనైనా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.

ఇదిలావుంటే, మరో ముగ్గురు శాసనసభ్యులు కూడా జగన్‌తో టచ్‌లో ఉన్నారని, షర్మిల పాదయాత్ర సందర్భంలోనే వారు కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారని అంటున్నారు. అయితే, కాంగ్రెసు పార్టీ కార్పోరేటర్లలో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. తమ పార్టీ శానససభ్యులు, పార్లమెంటు సభ్యులు తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని వారు చాలా కాలంగా మండిపోతున్నారు.

తమకు వ్యతిరేకంగా తమ పార్టీ శాసనసభ్యులు, మంత్రులు, ఎమ్మెల్సీలు ముఖ్యమంత్రికి లేఖ రాశారని, తమ తమ డివిజన్లలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడానికి జిహెచ్ఎంసికి కోటి రూపాయలు కేటాయించడాన్ని వారు తప్పు పట్టారని కాంగ్రెసు కార్పోరేటర్లు అంటున్నారు. ఆ నిధులు ఖర్చు పెడితే కార్పోరేటర్ల ప్రాబల్యం పెరుగుతుందని, దానివల్ల శానససభ అభ్యర్థులుగా ముందుకు వచ్చి తమకు పోటీగా తయారవుతారని శానససభ్యులు భయపడుతున్నారని చెబుతున్నారు. దాంతో చాలా మంది కార్పోరేటర్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి సుముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు.

గ్రేటర్ హైదరాబాదులోని 150 డివిజన్లలో కాంగ్రెసు కార్పోరేటర్లు 55 మంది ఉన్నారు . ఆ సంఖ్య 51కి తగ్గింది. సీతాఫల్‌మండి కార్పోరేటర్ విజయ్ కుమార్ తొలుత వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. ఆయన ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెసు గ్రేటర్ హైదరాబాద్ ఇంచార్జీగా వ్యవహరిస్తున్నారు. ఆ తర్వాత ఎస్. హర్షవర్ధన్ రెడ్డి (హబ్సిగుడా), జి. సుర్యనారాయణ రెడ్డి (సూరారం కాలనీ), సింగిరెడ్డి ధనపాల్ రెడ్డి (చెర్లపల్లి) వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. తన భర్తతో పాటు తెలుగుదేశం కార్పోరేటర్ డి. సురేఖ (ఆర్‌కె పురం) వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు.

పరిస్థితిని గుర్తించిన గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెసు అధ్యక్షుడు, మంత్రి దానం నాగేంద్ర నష్టనివారణ చర్యలకు పూనుకున్నారు. త్వరలోనే ఆయన కార్పోరేటర్లతో సమావేశం ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.

English summary
The YSR Congress has intensified its poaching of Congress and Telugu Desam corporators in the Greater Hyderabad Municipal Corporation after the MIM severed its ties with the Congress on Monday.
 Already, five corporators, four from the Congress and one from TD have joined YSRC.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X