చాచా నెహ్రూ జయంతి: పిల్లలతో పెద్దలు ఇలా...
హైదరాబాద్: ప్రథమ భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతి పిల్లల వండుగ. అంటే, బాలల దినోత్సవం. ఈ సందర్భంగా పిల్లలు వేడుకలు జరుపుకుంటారు. పెద్దలు పిల్లలతో కలిసి పోవడానికి ప్రయత్నిస్తారు. పిల్లల కోసం వారు చేపట్టే కార్యక్రమాలను ప్రభుత్వ పెద్దలు వివరిస్తారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, గవర్నర్ నరసింహన్ దంపతులు బుధవారం పిల్లలతో కాసేపు గడిపారు. పిల్లల పట్ల తమ ప్రేమానురాగాలను పంచుకున్నారు. పిల్లలకు కాస్తా బుద్ధులు చెప్పే పని కూడా చేశారు. కేంద్ర మంత్రి చిరంజీవి విజయవాడలో పిల్లల వేడుకల్లో పాల్గొన్నారు. తనకు పిల్లలంటే ఎంతో మక్కువ అని చెప్పుకున్నారు.

గవర్నర్ నరసింహన్ దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి, చిత్రపటానికి పూలమాల వేసి చాచా నెహ్రూకు నివాళులు అర్పించారు.

గవర్నర్ దంపతులు పిల్లలు చెప్పే చిట్టిపొట్టి మాటలను శ్రద్ధగా విన్నారు. వారికేం కావాలో, వారి పట్ల వారికి ఎంత పట్టింపు ఉందో చూపించారు.

బాల వేషధారులను గవర్నర్ అభినందించారు. చాచా నెహ్రూ వేషధారణలో పిల్లలు గవర్నర్ వద్దకు వచ్చారు. వారితో ఆయన ముచ్చటించారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాదులోని చాచా నెహ్రూ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. శాంతి పావురాన్ని ఎగురవేస్తున్నట్లు ఉన్న చాచా నెహ్రూ విగ్రహం వద్ద ముఖ్యమంత్రితో పాటు మంత్రి దానం నాగేందర్.

హైదరాబాదులోని రవీంద్రభారతిలో జరిగిన బాలల వేడుకల్లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చిన పిల్లలతో ఆయన నవ్వుతూ మాట్లాడారు. మజ్లీస్ మద్దతు ఉపసంహరించుకోవడంతో తీవ్ర ఒత్తిడికి గురువుతూ కూడా పిల్లలతో ఆయన సరదా గడిపారు. పక్కన మంత్రి సునీతా లక్ష్మారెడ్డి కూడా ఉన్నారు.

ముఖ్యమంత్రి సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చిన బాలలకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. చిన్నారి బాలలతో ఆయన ముద్దుగా మాట్లాడారు. వారికి తన ప్రసంగంలో ధైర్యం నూరిపోసే ప్రయత్నం కూడా చేశారు. జీవితంలో అధైర్యం కూడదని చెప్పారు. మంత్రులు గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications