విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబు, జగన్‌లపై చిరు ఘాటు వ్యాఖ్యలు: షర్మిల పైనా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైన, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన కేంద్రమంత్రి చిరంజీవి బుధవారం ఘాటు వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి విజయవాడలో రాజగోపాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన బాలల దినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబు టిడిపి ఉనికిని కాపాడుకునేందుకే పాదయాత్ర చేస్తున్నారని విమర్శించారు. ఆయన తన వస్తున్నా మీకోసం పాదయాత్రలో అన్నీ అబద్దాలే చెబుతున్నారన్నారు. ఆయన మాటలు ప్రజలు ఎవరూ నమ్మడం లేదన్నారు. రైతులను ఆకట్టుకునేందుకు చంద్రబాబు నానాతంటాలు పడుతున్నారన్నారు. విద్యుత్ ఉద్యమకారులపై కాల్పులు జరిపించిన చంద్రబాబు ప్రస్తుతం విద్యుత్ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.

బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కాంగ్రెసు పార్టీతోనే న్యాయం జరుగుతుందన్నారు. అవినీతిలో పుట్టిన పార్టీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అని చిరంజీవి.. జగన్ పార్టీపై ధ్వజమెత్తారు. జగన్ సోదరి షర్మిల తన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో అసత్యాలను ప్రచారం చేస్తోందన్నారు. మురికివాడ రహిత సమాజ నిర్మాణానికే రే పథకం అన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రతి నిమిషం పేదల గురించే ఆలోచిస్తారన్నారు.

ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదన్నారు. భవానీ ద్వీపం వ్యవహారంలో తన ప్రమేయం లేదన్నారు. ఈ విషయంలో తనపై బురద జల్లే ప్రయత్నం జరుగుతోందన్నారు. రాష్ట్రంలో అనేక పర్యాటక కేంద్రాలు ఉన్నాయన్నారు. గ్రామీణ భారత్ కోసం విదేశీయులు ఆసక్తి చూపిస్తున్నారని, రాష్ట్రంలో అపురూప పురావస్తు సంపద ఉందన్నారు. పర్యాటక రంగాన్ని సరిగా మార్కెట్ చేసుకుంటే యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు.

English summary
Central Minister Chiranjeevi lashed out at YSR Congress party chief YS Jaganmohan Reddy and TD chief Nara Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X