వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపి ఎమ్మెల్యే: జగన్‌ను కలిశారు, సస్పెండ్ అయ్యారు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Amarnath Reddy
హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని చిత్తూరు జిల్లా పలమనేరు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు అమర్నాథ్ రెడ్డి శుక్రవారం కలిశారు. ములాకత్ సమయంలో జగన్‌ను కలిసిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గ ప్రజలు, తన శ్రేయోభిలాషుల అభిప్రాయాలు తెలుసుకొని త్వరలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతానని చెప్పారు.

రాష్ట్రంలో కుమ్మక్కు రాజకీయాలు ఉన్నాయని, వాటితో తాను విసుగు చెందానన్నారు. తన నియోజకవర్గంలో తనను కాదని మరో ప్రత్యామ్నాయాన్ని తెలుగుదేశం పార్టీ ప్రోత్సహిస్తోందని, అందుకే తాను ఆ పార్టీలో కొనసాగడం కష్టంగా భావిస్తున్నానని చెప్పారు. టిడిపిని స్థాపించినప్పటి నుండి తాను అదే పార్టీలో ఉన్నానని, అలాంటి టిడిపిని వీడాల్సి వస్తుందని తాను ఎప్పుడూ అనుకోలేదన్నారు.

ఇటీవల తెలుగుదేశం ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకుందని, తాను జగన్ పార్టీలో చేరేందుకు ఇవే ప్రేరేపించాయన్నారు. తన నియోజకవర్గ ప్రజల కోరిక మేరకే తాను జగన్ పార్టీలో చేరాలనుకుంటున్నానని చెప్పారు. తనపై టిడిపి బురద జల్లే ప్రయత్నాలు చేస్తోందన్నారు. అమర్నాథ్ రెడ్డి నియోజకవర్గంలో టిడిపి శ్రేణులు నిరసనలు తెలుపగా, వైయస్సార్ కాంగ్రెసు శ్రేణులు ఉత్సాహంగా కనిపించాయి.

జగన్‌ను కలిసిన విజయమ్మ, భారతి

జైలులో ఉన్న వైయస్ జగన్మోహన్ రెడ్డిని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, భార్య భారతి రెడ్డి కలిశారు. ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. జగన్ కూడా షర్మిల పాదయాత్ర గురించి, ఆమె ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.

అమర్నాథ్ రెడ్డి సస్పెన్షన్

జైలులో ఉన్న జగన్‌ను పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి కలిశారని తెలియగానే తెలుగుశం పార్టీ ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని చెబుతూ వారు అతనిపై వేటు వేశారు.

English summary
Palamaneru TDP MLA Amarnath Reddy has suspended by party on Friday. He has met YSR Congress party chief YS Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X