హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌కి బాబు కౌంటర్: లోకేష్ యంగ్ గ్రూప్‌కి టిక్కెట్స్!

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan-Nara Lokesh
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో ధీటుగా ఎదుర్కొనే వ్యూహాలపై తెలుగుదేశం పార్టీ తీవ్ర కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ ఇప్పటికే తన ఉనికిని దాదాపు కోల్పోయింది. వచ్చే ఎన్నికల్లో జగన్ పార్టీయే తెలుగుదేశం పార్టీకి పెద్ద సవాల్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు కూడా చెబుతున్నారు.

జగన్‌కు పెద్ద ఎసెట్ యంగ్ లీడర్ కావడం. దీనికి కౌంటర్‌గా తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో నలభై లేదా అంతకు మిక్కిలి టిక్కెట్‌లను యువ నాయకులకు కేటాయించేందుకు సిద్ధమైంది. జగన్ పట్ల యువత బాగా ఆకర్షించబడుతోంది. అదే యువత టిడిపికి దగ్గరయ్యేందుకే నారా లోకేష్‌ను ఆ పార్టీ రంగంలోకి దింపింది. లోకేష్ రాజకీయ ఆరంగేట్రం ఇప్పుడే వద్దని చెప్పే బాబు కూడా జగన్‌ను ఎదుర్కోవాలంటే లోకేష్ వంటి నాయకులు కావాలనే భావనంతోనే తన తనయుడిని రంగంలోకి దింపారు.

ఇప్పుడు మరింత ధీటుగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీని ఎదుర్కొనేందుకు వ్యూహాలు రచిస్తోంది. పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు శుక్రవారం మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో యవతకు 40 శాతం సీట్లు ఇస్తామని చెప్పారు. అలాగే బిసిలకు వంద సీట్లు ఇస్తామన్నారు. దీనిని ఖచ్చితంగా తాము పాటిస్తామని చెప్పారు. అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు.

పార్టీ ఆదేశిస్తే సీనియర్ నాయకులు అందరూ లోకసభకు పోటీ చేస్తారన్నారు. లోకసభకు ఎవరిని పంపాలనే అంశంపై జోరుగా చర్చ సాగుతోందన్నారు. ఇప్పటికే రెండుసార్లు అధికారానికి దూరంగా ఉన్న టిడిపి ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. దీంతో జగన్‌ను ఎదుర్కొనేందుకు పాత వారిని లోకసభకు పంపించి యంగ్ టీంతో పాటు బిసిలను ఎన్నికల్లో రంగంలోకి దింపేందుకు ఎత్తులు వేస్తోంది.

English summary
Telugudesam Party chief Nara Chandrababu Naidu is ready to give forty tickets to Young leaders and Hundred tickets to BCs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X