వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

42మంది ఎంపీలనిస్తే: బాబు, టిడిపి మిత్రపక్షం: షర్మిల

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu - Sharmila
హైదరాబాద్/కర్నూలు: తనకు 42 మంది పార్లమెంటు సభ్యులను ఇస్తే రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసి చూపిస్తానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గురువారం అన్నారు. రంగారెడ్డి జిల్లాలో ఆయన వస్తున్నా మీకోసం పాదయాత్ర కొనసాగింది. ప్యాకేజీలు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకే తెలుసునన్నారు. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పుడు తెరాస ఒక్క పనైనా చేసిందా అని ప్రశ్నించారు.

రాష్ట్రంలో కాంగ్రెసు నేతలు దోచుకు తింటున్నారన్నారు. అవినీతిపరులకు నిలయంగా మారిన చంచల్‌గూడ జైలు నుంచి కొందరు శవ రాజకీయాలకు, నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. సామాజిక తెలంగాణ అన్న ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ తనలో కలిపేసుకుందని.. మిగతా రెండు పార్టీలతో బేరాలు మొదలుపెట్టిందన్నారు.

ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఎన్నాళ్లు ఉంటారో తెలియదని వ్యంగ్యంగా అన్నారు. రాష్ట్రం నుంచి 10 మంది కేంద్ర మంత్రులున్నారని, వారంతా శుద్ధ దండగన్నారు. గతంలో మీరు టిడిపికి అధికంగా ఎంపీలను ఇస్తే కేంద్రంలో చక్రం తిప్పామని, ఒక్క ఫోన్‌కాల్‌తో సమస్యలను పరిష్కరించే వాళ్లమన్నారు. వచ్చే ఎన్నికల్లో 42 ఎంపీ సీట్లు ఇస్తే రాష్ట్రంలోని అన్ని సమస్యలనూ పరిష్కరిస్తానని బాబు చెప్పారు.

జగన్ బయటకొస్తారు

తన సోదరుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలు నుండి బయటకు వస్తారని ఆయన సోదరి షర్మిల కర్నూలు జిల్లా మరో ప్రజా ప్రస్థానంలో అన్నారు. జగన్ మళ్లీ రాష్ట్రంలో వైయస్ రాజశేఖర రెడ్డి రాజ్యాన్ని తీసుకు వస్తారన్నారు. టిడిపి ప్రధాన ప్రతిపక్షంగా కాకుండా కాంగ్రెసు మిత్రపక్షంగా ఉంటోందన్నారు.

English summary
TD chief Nara Chandrababu Naidu said he will change Andhra Pradesh if people give 42 MP seats in next general elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X