క్లియర్: జగన్‌తో దోస్తీకి అసదుద్దీన్ ఓవైసీ రెడీ

వైయస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ముస్లింలను పట్టించుకునేవారు లేకుండా పోయారని ఆయన అన్నారు. భాగ్యలక్ష్మి ఆలయం వివాదం ఒక్కటే తాము తెగదెంపులు చేసుకోవడానికి కారణం కాదని, 80 లక్షల మంది ముస్లింల ప్రయోజనాల కోసం ఆ పనిచేశామని ఆయన ఆ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఫీజు రీయంబర్స్‌మెంట్‌లో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ముస్లిం విద్యార్థులకు అన్యాయం చేసిందని విమర్శించారు.
అమాయక ముస్లింలపై పోలీసుల వేధింపులు పెరిగాయని ఆయన విమర్శించారు. మహావీర్ ఆస్పత్రి స్థలం కోసమే వివాదాన్ని ముందుకు తెచ్చినట్లు వస్తున్న విమర్శలను ఆయన కొట్టిపారేశారు. దానిపై కూడా ఆయన వివరణ ఇచ్చారు. ముఖ్యమంత్రి కార్యాలయం ఎంపిక చేసి సమాచారాన్ని లీక్ చేస్తోందని ఆయన విమర్శించారు. దారుసలాం మెడికల్ ఎడ్యుకేషన్ ట్రస్టు ఆ స్థలం కోసం పెట్టుకున్న దరఖాస్తును వెనక్కి తీసుకుందని ఆయన చెప్పారు.
పట్టపగలు తన సోదరుడు, శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీపై గుండాలు దాడి చేశారని ఆయన ఆరోపించారు. చాంద్రాయణగుట్టలోని వంద ఎకరాల ప్రభుత్వ భూమిని తాము రక్షిస్తున్న క్రమంలోనే ఆ దాడి జరిందని ఆయన ఆరోపించారు. 2010 నుంచి కిరణ్ కుమార్ రెడ్డి ముస్లింలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని, కిరణ్ కుమార్ రెడ్డి లౌకిక వాద కారని ఆయన అన్నారు. కాంగ్రెసుతో తెగదెంపులు చేసుకోవడం వల్ల బిజెపి వంటి మతతత్వ పార్టీలు లాభపడే అవకాశం ఎంత మాత్రమూ లేదని ఆయన అన్నారు.
ఆయన మాటలను బట్టి వైయస్ జగన్‌తో దోస్టీ కట్టడానికి అసదుద్దీన్ ఓవైసీ సిద్దపడినట్లు అర్థమవుతోంది. రాష్ట్రంలో కాంగ్రెసు పరిస్థితి తీసికట్టుగా ఉందనే విషయం అందరికీ తెలిసిన విషయమే. ఈ స్థితిలో కాంగ్రెసుతో తెగదెంపులు చేసుకోవడమే మంచిదనే నిర్ణయానికి వచ్చి వ్యవహరించినట్లు చెబుతున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో ముస్లింల కోసం జరిగిన మేళ్లను ఆయన వివరించారు. కిరణ్ కుమార్ రెడ్డి కొన్ని పథకాలను ఎలా పట్టించుకోలేదో చెప్పారు. ఇదంతా జగన్‌తో అధికారికంగా దోస్తీ కట్టడానికి అవసరమైన పూర్వరంగాన్ని సిద్ధం చేసుకోవడమేనని అంటున్నారు.












Click it and Unblock the Notifications