జగన్‌ను కట్టడి చేద్దాం: కెసిఆర్, కోదండతో ప్యాచప్

KCR - Kodandaram
హైదరాబాద్: తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్‌తో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరా) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ప్యాచప్ చేసుకున్నారు. కలిసి పనిచేద్దామని చెప్పారు. కోదండరామ్ సహా ఇతర జెఎసి నేతలతో కెసిఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఆయన శ్రీనివాస గౌడ్‌ను అహ్వానించలేదు. దాదాపు గంటన్నర సేపు కెసిఆర్ జెఎసి నేతలతో చర్చలు జరిపారు. ఆ తర్వాత కోదండరామ్‌తో కలిసి మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు.

తెలంగాణలో వైయస్ జగన్ పార్టీని కట్టడి చేద్దామని సమావేశంలో అనుకున్నారు. తెలంగాణ జెఎసితో ఉన్న తమ అభిప్రాయ భేదాలను పరిష్కరించుకున్నట్లు కెసిఆర్ చెప్పారు. ఇక నుంచి కలిసి మెలిసి ఉద్యమిస్తామని అన్నారు. తెలంగాణ సాధించుకునే వరకు కలిసికట్టుగా పోరాడుతామని కెసిఆర్ చెప్పారు. ఉద్యమ కార్యాచరణను రూపొందించేందుకు త్వరలో కమిటీ వేస్తామని ఆయన చెప్పారు. నవంబర్ 29వ తేదీ దీక్షా దివస్‌లో జెఎసి పాల్గొంటుందని ఆయన చెప్పారు .

పార్లమెంటు శీతాకాలం సమావేశాలకు తాము హాజరవుతామని, పార్లమెంటును స్తంభింపజేస్తామని కెసిఆర్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ పతనం ఖాయమని, పది పదిహేను రోజులకు మించి ప్రభుత్వం ఉంటుందన్న నమ్మకం తనకు లేదని కెసిఆర్ అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తమ పార్టీ తెలంగాణలో విజయం సాధిస్తుందని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతారనే నమ్మకం లేదని ఆయన అన్నారు. ఒకవేళ అవిశ్వాసం పెడితే ప్రభుత్వాన్ని కూల్చడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు.

తెలంగాణ కోసం కేంద్ర ప్రభుత్వంతో చేయాల్సిందింతా చేశానని, తెలంగాణపై కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయం తీసుకోవడం లేదని కెసిఆర్ అన్నారు. ఎన్ని రోజులు వేచి చూస్తాం, మన దారి మనం చూసుకుందామని ఆయన అన్నారు. ఉద్యమాన్ని సజీవంగా ఉంచుదామని ఆయన అన్నారు. మంత్రి గీతారెడ్డిపై చేసిన వ్యాఖ్యల విషయంలో తనకు దురుద్దేశాలు లేవంటూ క్షమాపణ చెప్పినా కోదండరామ్‌ను వదలడం లేదని, దీన్ని దాడిగానే పరిగణిస్తామని ఆయన అన్నారు.

బిజెపి గురించి ఇప్పుడేమీ మాట్లాడవద్దని, పొత్తులూ ఎత్తుల గురించి ఎన్నికల సమయంలో మాట్లాడుతామని ఆయన అన్నారు. బిజెపి కేంద్రంలో అధికారంలోకి వస్తే తెలంగాణ ఇచ్చే అవకాశాలున్నాయని, చాలా రాష్ట్రాల్లో బిజెపి బలంగా ఉందని ఆయన అన్నారు. మహబూబ్‌నగర్ ఉప ఎన్నికలో తెలంగాణ జెఎసి తీరు బాగా లేదని, జెఎసి తీరు బిజెపికి ఉపయోగపడిందని ఆయన అన్నారు. తెలంగాణ మార్చ్ విషయంలో వ్యవహరించిన తీరు కూడా తనకు మనస్తాపాన్ని కలిగించిందని, ఇటువంటి పునరావృతం కాకుండా చూడాలని ఆయన అన్నారు.

ఈ నెల 23వ తేదీ తెరాస తలపెట్టిన సూర్యాపేట బహిరంగ సభను, నవంబర్ 29వ తేదీ దీక్షా దివస్‌ను విజయవంతం చేయాలని కోదండరామ్ పిలుపునిచ్చారు. డిసెంబర్ 9వ తేదీ తెలంగాణ సాధన దినం కాబట్టి ఆ రోజు నిరసన వ్యక్తం చేయకూడదని అనుకున్నట్లు కెసిఆర్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+