శివాజీ పార్క్‌లో థాకరే అంత్యక్రియలు: రోదించిన ఉద్దవ్
ముంబయి: శివసేన అధినేత బాల్ థాకరే మృతదేహానికి సాయంత్రం ఆరు గంటలకు దహన సంస్కారాలు చేస్తారు. సందర్శన కోసం శివాజీ పార్కులో థాకరే మృతదేహాన్ని ఉంచారు. అభిమానుల తాకిడితో శివాజీ పార్కు కిక్కిరిసి పోయింది. ముంబయి రోడ్లు కూడా జనసంద్రమయ్యాయి. శివాజీ పార్కుకు భారతీయ జనతా పార్టీ జాతీయ నేతలు లాల్ కృష్ణ అద్వానీ, అధ్యక్షుడు నితిన్ గడ్కరీ, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, మేనకా గాంధీ తదితరులు చేరుకున్నారు.

బాల్ థాకరేను చూసేందుకు లక్షలాదిగా అభిమానులు తరలి వచ్చారు. థాకరే అంతిమయాత్రలో దాదాపు 20 లక్షల మంది హాజరయ్యారు. శివాజీ పార్క్‌కు కూడా లక్షలాది మంది చేరుకున్నారు. ఆయన తనయుడు ఉద్దవ్ థాకరే వెక్కి వెక్కి ఏడ్చారు. థాకరే స్థాపించిన ఆంగ్ల పత్రిక సామ్నా, హిందీ పత్రిక దోపహార్ సామ్నాలు సంతాపం ప్రకటించాయి. జాకెట్ పేజీలు, కవర్ పేజీలు కూడా పూర్తి నలుపులో ప్రచురించి ఆ పత్రికలు తమ విచారాన్ని వ్యక్తం చేశాయి. రెండు కవర్ పేజీలు పూర్తి నలుపు రంగులో ప్రచురించడం పత్రిక చరిత్రలో ఇదే తొలిసారి.
జాకెట్ కవర్ పేజీ పైన థాకరే నవ్వుతున్న ఫోటో పెద్దది ప్రచురించారు. మా యజమాని వెళ్లిపోయారని రాశారు. కింద పరాఠీలో ఒక చిన్న కవితను ప్రచురించారు. దోపహార్ సామ్నా ఆదివారం సాధారణంగా పని చేయదు. అలాంటిది ఈ రోజు థాకరేపై ప్రత్యేక సంచికను తీసుకు వచ్చింది. కాగా థాకరేను శివాజీ పార్కుకు ఆయన ఇళ్లు మాతోశ్రీ నుండి ఊరేగింపుగా తీసుకు వచ్చారు. థాకరే అంత్యక్రియలకు నామా నాగేశ్వర రావు హాజరయ్యారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications