వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబాయ్ ముందు జాగ్రత్త: అబ్బాయ్ ఎన్టీఆర్ రాజీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Balakrishna - NTR
హైదరాబాద్: యాదృచ్ఛికమో కాదో తెలియదు గానీ నందమూరి హీరోలు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రకటనలు ఒక రోజునే వెలువడ్డాయి. బాబాయ్ బాలయ్య ప్రకటన చూసి జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడి ఉండడానికి కూడా అవకాశం ఉంది. ఇద్దరు కూడబలుక్కున్నట్లే ప్రకటనలు ఉన్నాయి. అయితే, ఇద్దరి ప్రకటనల్లోనూ కాస్తా తేడా ఉంది.

బాలకృష్ణ ముందు జాగ్రత్తగానే ప్రకటన చేసినట్లు కనిపిస్తుండగా, జూనియర్ ఎన్టీఆర్ తాను రాజీకి వచ్చానని చెప్పడానికి ప్రకటన చేసి ఉంటారని అంటున్నారు. తాను శాసనసభకే పోటీ చేస్తానని చెప్పడం ద్వారా పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఆయన ఓ సంకేతం ఇవ్వదలుచుకున్నట్లు చెబుతున్నారు. తాను రాష్ట్ర రాజకీయాల్లోనే ఉండదలుచకున్నానని ఆయన ఆ రూపంలో చెప్పారని అంటున్నారు.

అనంతపురం జిల్లా హిందూపురం నుంచి బాలకృష్ణను పోటీకి దించే అవకాశాలున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో తనను లోకసభకు పోటీ చేయాలని ముఖాముఖి చంద్రబాబు అడిగే అవకాశాన్ని ఇవ్వకూడదనేది బాలయ్య ఉద్దేశంగా కనిపిస్తోంది. తాను లోకసభకు పోటీ చేయబోనని, శాసనసభకే పోటీ చేస్తానని ముందే చెప్పానని తప్పించుకోవడానికి వీలుంటుందని భావించి ఆయన మాట్లాడి ఉంటారని అంటున్నారు. రాష్ట్ర రాజకీయాలకు తాను దూరం కాదలుచుకోలేదని కూడా బాలకృష్ణ చెప్పినట్లయింది.

నారా లోకేష్ రాజకీయ ప్రవేశం విషయంలో వారసత్వ పోరుకు దిగి జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబుకు దూరమయ్యారంటూ వార్తలు వచ్చాయి. ఆళ్ల నాని పార్టీ మారడంపై, వల్లభనేని వంశీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను కలవడంపై జూనియర్ ఎన్టీఆర్ మీద పార్టీ నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. చంద్రబాబుకు, జూనియర్ ఎన్టీఆర్‌కు మధ్య పూర్తిగా చెడినట్లేనని వార్తలు వచ్చాయి.

అయితే, తెలుగుదేశం పార్టీకి దూరమైతే జరిగే నష్టాన్ని గ్రహించిన జూనియర్ ఎన్టీఆర్ రాజీకి వచ్చేందుకు సిద్ధపడినట్లు చెబుతున్నారు. బాలకృష్ణకు, చంద్రబాబుకు దగ్గర కావాలని ఆయన అనుకుంటున్నారని సమాచారం. ఇందులో భాగంగానే ఆయన శుక్రవారం ప్రకటన చేశారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మీతోనే ఉంటానని జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబుకు, బాలకృష్ణకు తన ప్రకటన ద్వారా సందేశం పంపినట్లు భావిస్తున్నారు.

English summary
It is said that Nandamuri hero Balakrishna has made statement taking extra care. Meanwhile, another Nandanuri hero Jr NTR has made political statement in a bid to patchup with Telugudesam president N Chandrababu Naidu and Balakrishna.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X