వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాలికి భంగపాటు: విజయసాయి రెడ్డి పిటిషన్

By Pratap
|
Google Oneindia TeluguNews

Gali Janardhan Reddy
హైదరాబాద్: ఓబుళాపురం మైనింగ్ కేసులో నిందితుడై కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ విషయంలో సిబిఐ కోర్టులో మరోసారి భంగపాటు ఎదురైంది. ఆరోసారి ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను సిబిఐ కోర్టు కొట్టేసింది. గాలి జనార్దన్ రెడ్డిని సిబిఐ ఓబుళాపురం మైనింగ్ కేసు (ఒఎంసి) కేసులో సిబిఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

ఇదిలావుంటే, తన బెయిల్ షరతులను సడలించాలని కోరుతూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో నిందితుడైన జగతి పబ్లికేషన్స్ వైస్ ప్రెసిడెంట్ విజయసాయి రెడ్డి సోమవారం పిటిషన్ దాఖలు చేశారు.

హైదరాబాదు విడిచి వెళ్లరాదనే నిబంధనలను సడలించాలని ఆయన కోర్టును కోరారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో విజయసాయి రెడ్డి ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) విచారణ నిమిత్తం ఢిల్లీ వెళ్లి వస్తున్నారు.

వాన్‌పిక్ వ్యవహారంలో అరెస్ట్ అయిన మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ, ఓఎంసీ కేసు నిందితుడు రాజ్‌గోపాల్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. వీరు పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. వైయస్ జగన్‌కు చెందిన వాన్‌పిక్ వ్యవహారంలో అరెస్టయిన తర్వాత మోపిదేవి వెంకటరమణ మంత్రి పదవికి రాజీనామ చేశారు. వాన్‌పిక్ వ్యవహారంలో ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కూడా అరెస్టయ్యారు.

English summary
CBI court has rejected former Karnataka minister Gali Janardhan Reddy bail petition, arrested by CBI in OMC case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X