జగన్‌ను రక్షించేందుకే క్లీన్ చిట్: రేవంత్, గవర్నర్‌పై ఫైర్

Revanth Reddy
హైదరాబాద్: మంత్రులకు క్లీన్ చిట్ ఇవ్వడం ద్వారా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కాపాడే ప్రయత్నం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్నాయని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రేవంత్ రెడ్డి మంగళవారం ఆరోపించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన కేబినెట్ అవినీతి మంత్రులకు క్లీన్ చిట్ ఇవ్వడమేమిటని ప్రశ్నించారు. అవినీతి మంత్రులకు భరోసా కల్పించేందుకే ధర్మాన రాజీనామాను తిరస్కరించారని కిరణ్ పైన ధ్వజమెత్తారు.

ధర్మాన పైన గవర్నర్ నరసింహన్ చర్యలు తీసుకోవాలని సూచించారు. గవర్నర్ భవనంను గాంధీ భవనంగా మార్చేశారని మండిపడ్డారు. ధర్మాన వ్యవహారంపై కలిసేందుకు తాము ప్రయత్నిస్తే గవర్నర్ తమకు అపాయింటుమెంట్ ఇవ్వలేదన్నారు. రాజ్యాంగ బద్ధ అధికారాలతో ధర్మాన పైన గవర్నర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వాలు జగన్‌ను కాపాడే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. గవర్నర్ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి గూఢచారిగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదన్నారు. ముఖ్యమంత్రి, గవర్నర్ ఇద్దరూ అవినీతిపరులను కాపాడే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తోందన్నారు. ఎఫ్‌డిఐలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. గిరిజన హక్కులను కాపాడాలన్న కేంద్రమంత్రి కిశోర్ చంద్రదేవ్ లేఖపై గవర్నర్ ఎందుకు స్పందించడం లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+