జగన్‌ను గెలిపించాల్సిందే: షర్మిల, వైయస్ కన్నా గొప్పా

Sharmila
మహబూబ్ నగర్/గుంటూరు: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు తమ పదవులను కాపాడుకునేందుకు ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల సోమవారం విమర్శించారు. ప్రస్తుతం విద్యుత్ కోతలతో రైతులు, ఫీజులు కట్టలేక విద్యార్థులు, పింఛన్లు రాక వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.

జలయజ్ఞం ప్రాజెక్టులు పూర్తి చేయడానికి అవసరమైన నిధులను విడుదల చేయడంలోనూ ఈ ప్రభుత్వం జాప్యం చేస్తోందన్నారు. ప్రజల కష్టాలు తీరాలంటే వైయస్సార్ కాంగ్రెసు పార్టీని గెలిపించాల్సిందే అన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయితేనే అన్ని సమస్యలు తీరుతాయన్నారు. విద్యుత్ లేకున్న బిల్లు మాత్రం బాగా వస్తుందని ఎద్దేవా చేశారు. జగన్ వస్తే రామరాజ్యం వస్తుందని షర్మిల చెప్పారు

వైయస్ కంటే ధర్మాన ఎలా గొప్ప

సిబిఐ చార్జ్‌షీట్‌లో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి పేరు చేర్చినప్పుడు ఈ మంత్రి వర్గం ఎందుకు నోరు మెదపలేదని, వైయస్ కంటే మంత్రి ధర్మా న ప్రసాద రావు ఏ విధంగా గొప్ప అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ ప్రశ్నించారు.

తమ పదవులు పోతాయనే భయంతోనే ధర్మానకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రివర్గం వత్తాసు పలుకుతున్నారని ధ్వజమెత్తారు. ఆ 26 జివోల్లో తప్పులేదన్నప్పుడు వైఎస్ జగన్‌ను ఎందుకు జైల్లో పెట్టించారని ప్రశ్నించారు. మంత్రులు చేసిన తప్పులకు ఐఏఎస్ అధికారులను కూడా జైలుకు పంపారన్నారు. జీవోల్లో తప్పులుంటే వాటికి ఆ శాఖ మంత్రులే బాధ్యత వహించాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+