జగన్‌కు క్షమాపణ చెప్పాలి: జూపూడి, సిబిఐపై విమర్శ

జగన్‌పై కుట్ర చేస్తే నియంతలకు పట్టిన గతే కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు పడుతుందన్నారు. సిబిఐ మ్యాన్యూవల్‌ను కూడా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. జగన్ విషయంలో సిబిఐ వ్యక్తిగత కక్షతో వ్యవహరిస్తోందని ఆరోపించారు. హైకోర్టు, సుప్రీం కోర్టు తీర్పులను కూడా సిబిఐ విస్మరించడమేమిటన్నారు.
జివోలు అన్నీ సరైనవేనని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అంటున్నారని, అలాంటప్పుడు క్విడ్ ప్రోకో ఎక్కడదని ప్రశ్నించారు. జివోలు సరైనవని కోర్టుకు ఎందుకు తెలియజేయరన్నారు. సిబిఐ అధికారులు యుపిఎస్‌సి ద్వారా నియమితులయ్యారా లేక రాజకీయ పార్టీల ద్వారా అయ్యారా చెప్పాలన్నారు.
ప్రజా కోర్టులో జగన్‌దే అంతిమ విజయం అన్నారు. కాంగ్రెసు, టిడిపిలు కుమ్మక్కై జగన్ పైన ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు క్షమించరన్నారు. సుప్రీం కోర్టులో భవిష్యత్తులో క్విడ్ ప్రోకో లేదని ప్రభుత్వం చెబితే అక్షింతలు వేసి జగన్‌కు క్షమాపణ చెప్పి ఇంటికి పంపించవలసి ఉంటుందన్నారు.
జగన్‌కు బెయిల్ రాకుండా కాంగ్రెసు, టిడిపిలు పథకం ప్రకారమే కుట్ర చేస్తున్నాయని తిరుపతి శాసనసభ్యుడు, మాజీ టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications