వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్‌కు ఇదే నా సవాల్, రావాల్సిందే: మందకృష్ణ

By Pratap
|
Google Oneindia TeluguNews

 Manda Krishna Madiga
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీయస్) వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తీవ్రంగా మండిపడ్డారు. కెసిఆర్ ఎక్కడ సభ పెట్టారో తాము అక్కడే పెడతామని, మొదటి ఆహ్వానం కెసిఆర్‌కు ఇస్తామని, కెసిఆర్ వచ్చి మాట్లాడాలని ఆయన అన్నారు.

ఉద్యమాల పేరుతో తెలంగాణ ప్రజలను అణువణువునా మోసం చేస్తున్న తెరాస అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు బొంతపురుగు కన్నా హీనమైన వ్యక్తి అని మందకృష్ణ మాదిగ విమర్శించారు. సోమవారం సికింద్రాబాద్ పార్శిగుట్ట రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలు రాజెల్లయ్య మాదిగ, వంగపల్లి శ్రీనివాస్, వీహెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అందె రాంబాబులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.

మంత్రి గీతారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరాం బహిరంగ క్షమాపణ చెప్పారని, అయితే కోదండరాంను సమర్థించిన కేసీఆర్‌ను వదిలిపెట్టేది లేదని ఆయన అన్నారు. ఆదివారం నాటి తెలంగాణ సమరభేరి సభలో కేసీఆర్ తనపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కేసీఆర్‌కు దళిత ముఖ్యమంత్రి పేరు ప్రకటించడం తెలియదా? అని మందకృష్ణ ప్రశ్నించారు.

గత పదేళ్లుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న కెసిఆర్ ఇప్పటివరకు పేరు ప్రకటించకపోవడం విడ్డూరమన్నారు. తెలంగాణలో కేసీఆర్ నిర్వహించిన చోటల్లా తాము బహిరంగ సభలు నిర్వహిస్తామని సవాల్ విసిరారు.

వృద్ధులు, వితంతువుల పింఛన్లు వేయి రూపాయలు పెంచనట్లయితే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి సంగతి తేలుస్తామని మందకృష్ణ హెచ్చరించారు. వచ్చే 17న హైదరాబాద్‌లో జరిగే సభలో ఈ సంగతి తేల్చుకుంటామన్నారు. లేదంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడిస్తామన్నారు.

English summary
MRPS founder president Manda Krishna Madiga has challenged Telangana Rastra Samithi (TRS) president K Chandrasekhar Rao. He said that he will conduct public meeting where KCR has organised.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X