కెసిఆర్ తాగుడుకే పుట్టాడు: మోత్కుపల్లి, జగన్ పైనా

తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ మంత్రి గీతారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కెసిఆర్ ఎలా సమర్థిస్తారని ప్రశ్నించారు. గీతారెడ్డి తమ సామాజికవర్గం మహిళా ప్రతినిధి అని, ఆమెను అంటే తమను అన్నట్లేనని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు కెసిఆర్‌కు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
ఎనిమిది వందల మంది విద్యార్థుల ఆత్మాహుతి పాపం కెసిఆర్‌దే అన్నారు. సకల జనుల సమ్మెను నీరుగార్చిన కూడా కెసిఆర్‌దే అన్నారు. తెలంగాణవాదం పేరుతో ఓట్లు సీట్లు దక్కించుకునే కుటిల ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ప్రజల సెంటిమెంటును ఉపయోగించుకొని పన్నెండు ఏళ్లుగా వేల కోట్లు దండుకున్న ఘనుడు అన్నారు.
తెలంగాణ ఉద్యమాన్ని కేసిఆర్ ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. దళితుల ఓట్లతోనే ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచిన కెసిఆర్ ఇప్పుడు దళితులను విమర్శిస్తున్న వారిని సమర్థిస్తున్నారని విమర్శించారు. తాగి పిచ్చి మాటలు మాట్లాడే కెసిఆర్ తెలంగాణకు పట్టిన చీడపురుగు అన్నారు. పిట్టకథలతో తెలంగాణ వస్తుందా అని ప్రశ్నించారు. వాతలు పెట్టినా తప్పులేదన్నారు.
కెసిఆర్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యూలేటరీపై ఎందుకు మాట్లాడటే లేదని ప్రశ్నించారు. కెసిఆర్ తాగడం కోసం, డబ్బు కోసం, అబద్దాలు చెప్పడం కోసమే పుట్టారన్నారు. వైయస్సార్ కాంగ్రెసు నేతలు పగులగొట్టాల్సింది జైలు గోడలు కాదన్నారు. జగన్ ఇంట్లోని బాక్సులు పగులగొడితే కోట్లు వస్తాయన్నారు. నాగం జనార్ధన్ రెడ్డి తెలంగాణ కోసమే మాట్లాడుతున్నారు కాబట్టి సంతోషమే అన్నారు.












Click it and Unblock the Notifications