చంచల్‌గూడ జైలులో సైరన్ మోత: ఆగిన ములాకత్‌లు

రెండు రోజుల క్రితం కూడా యనమల జగన్ జైలు సౌకర్యాలపై లేఖ రాశారు. అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా జైలులో సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్‌లు ఉపయోగిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేత యనమల రామకృష్ణుడు గవర్నర్ నరసింహన్‌కు లేఖ రాశారు. జగన్‌కు జైలు అధికారులు సహకరిస్తున్నారని ఆ లేఖలో ఆరోపించారు. జైల్లో నిబంధనల ఉల్లంఘనలపై విచారణకు డిజిపిని ఆదేశించాలని ఆయన గవర్నర్‌ను కోరారు.
విఐపి ఖైదీ జగన్‌తో కొందరు జైలు అధికారులు కుమ్మక్కై ఇంటర్నెట్ సౌకర్యం కూడా కల్పిస్తున్నారని, జగన్‌ను కలిసేవారి ములాఖత్‌ల రికార్డుల్ని అధికారులు సరిగా నిర్వహించడం లేదని పేర్కొన్నారు. నిబంధనల ఉల్లంఘన, జగన్‌కు సౌకర్యాలపై ఫిర్యాదు చేసినా జైళ్ళ శాఖ స్పందించలేదన్నారు. సమాచార హక్కు చట్టం కింద చేసిన దరఖాస్తుకూ సమాచారం ఇవ్వాలేదని ఆయన గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్లారు. గవర్నర్‌కు రాసిన లేఖను ముఖ్యమంత్రికి కూడా పంపారు.












Click it and Unblock the Notifications