మెదక్‌లో బాబు, పాలమూరులో షర్మిల పాదయాత్ర
మెదక్/మహబూబ్ నగర్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్ర మంగళవారం మెదక్ జిల్లాలోని పెద్దశంకరంపేట నుంచి ప్రారంభమయింది. ఈ రోజుతో జిల్లాలో బాబు యాత్ర పదవ రోజుకు చేరుకుంటుంది. మొత్తంగా 57వ రోజు. అలీఖాన్‌పల్లి వరకు పద్దెనిమిది కిలోమీటర్ల మేర బాబు పాదయాత్ర సాగనుంది. ఈ సందర్భంగా బాబు మాట్లాడారు.

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే పెద్దశంకరంపేటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఆయన జూనియర్ కళాశాలలో విద్యార్థులతో ముచ్చటించారు. కళాశాలలోని సమస్యలను విద్యార్థులు చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్లారు. కళాశాలకు మంచినీళ్లు, లైబ్రరీ ఇతర సౌకర్యాల కోసం ఎంపీ లాడ్స్ నుండి రూ.2 లక్షలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
షర్మిల యాత్ర
మెదక్ జిల్లాలో చంద్రబాబు పాదయాత్ర కొనసాగుతుండగా మహబూబ్ నగర్ జిల్లాలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర ప్రారంభమయింది. జిల్లాలోని బూడిదపాడు నుంచి 41వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. పాదయాత్ర రాయచూర్ రోడ్ వరకు కొనసాగుతుంది. షర్మిల ఈ రోజు 15 కిలోమీటర్లు నడువనున్నారు.












Click it and Unblock the Notifications