'జగన్‌ను వదిలేయకపోతే జైలు గోడలు బద్దలు కొడ్తాం'

రైతు సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని, నీలం తుఫాను కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తోందని ఆయన విమర్శించారు. రైతాంగానికి మేలు జరగాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాల్సిందనని అన్నారు. రైతు నాయకుడైన జగన్‌ను ప్రభుత్వం కుట్రతో జైల్లో పెట్టిందని, జగన్‌ను తక్షణమే విడుదల చేయకపోతే ప్రజలు తిరగబడతారని ఆయన అన్నారు.
అవసరమైతే జైలు గోడలు బద్దలు కొట్టి ఆయన్ను బయటకు తీసుకువస్తామని ఉదయభాను అన్నారు. వైసీపీ నాయకులు దేవినేని చంద్రశేఖర్, జి.వి.ప్రసాదరావు, కోవెలమూడి వెంకటనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
హైదరాబాద్ జోలికి వస్తే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును రాయలసీమ, ఆంధ్ర ప్రజలు తరిమి కొడతారని, అప్పుడు కెసిఆర్ కాపాడమని తనవద్దకు రావాల్సి వస్తుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాష్ట్ర మైనారిటీ సెల్ కన్వీనర్, మాజీ ఎమ్మెల్సీ రెహమాన్ అన్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో సోమవారం రాత్రి జరిగిన గడపగడపకు వైసీపీ ముగింపుసభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. షర్మిలపాదయాత్రను చూసి కెసిఆర్‌కు నిద్ర పట్టడం లేదన్నారు.
కెసిఆర్ పెద్ద వెధవని, తెలంగాణ కెసిఆర్ అబ్బ సొత్తు కాదన్నారు. తెలంగాణ వస్తే కెసిఆర్ తెచ్చేది నీళ్ళు కాదు కల్లు తెస్తాడని వ్యాఖ్యానించారు. కలెక్షన్, కన్ర్‌స్టక్షన్, ఎలక్షన్ మాత్రమే కేసీఆర్‌కు తెలుసునని విమర్శించారు. త్వరలో కేసీఆర్ బండారం బయట పెడతానని తెలిపారు.












Click it and Unblock the Notifications