కేబినెట్లో ప్రోటోకాల్: సిఆర్సీకి అనం అండ: డిఎల్ మౌనం

తన శాఖకు సంబంధించిన కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటున్నప్పటికీ అధికారులు సమాచారం ఇవ్వడం లేదని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీ మాథ్యూపై దేవాదాయ శాఖ మంత్రి సిఆర్సీ ఫిర్యాదు చేశారు. అదే సమయంలో.. సీనియర్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జోక్యం చేసుకొని.. సిఎస్ తీరు బాగాలేదని, సిఎం సమక్షంలో ప్రొటోకాల్ అంశం చర్చకు రావడం భావ్యం కాదని, ఇది మొదటిసారి కాదని కాదన్నారు.
తర్వాత నీలం తుఫానుపై చర్చించారు. బాధితులకు పరిహారం చెల్లింపు పెంపుపై 30లోగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికకు చట్టబద్ధత కల్పిస్తూ ముసాయిదా బిల్లులో ఉన్న అంశాలను ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ కేబినెట్ సహచరులకు వివరించారు.












Click it and Unblock the Notifications