వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యాత్రలో వైయస్‌ను తల్చుకొని కంటతడి పెట్టిన షర్మిల

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sharmila
మహబూబ్ నగర్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల గురువారం కంట తడి పెట్టుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఆమె పాదయాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆమె నెట్టెంపాడు ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా ఇంజనీర్లను పలు వివరాలు అడిగి ఆమె తెలుసుకున్నారు. అక్కడే ప్రాజెక్టు ఆవరణలో ఉన్న దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి ఆమె పాలాభిషేకం చేశారు.

విగ్రహాన్ని చూసిన షర్మిల తన తండ్రిని గుర్తుకు తెచ్చుకొని ఉద్వేగానికి లోనై కంట తడి పెట్టారు. అనంతరం తమాయించుకున్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడారు. జలయజ్ఞంలో భాగంగా వైయస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన నెట్టంపాడు ప్రాజెక్టు పూర్తయితే రెండు లక్షల ఎకరాలకు సాగు నీరు అందనుందని ఆమె అన్నారు. వైయస్ మృతి తర్వాత ఆయన ఆశయాలు నెరవేరట్లేదని కాంగ్రెసు ప్రభుత్వంపై విమర్శించారు.

కాగా షర్మిల పాదయాత్ర గురువారం నెట్టెంపాడు నుండి ప్రారంభమైంది. ప్రాజెక్టును ప్రారంభించిన అనంతరం ఆమె తన పాదయాత్రను వామనపల్లి మీదుగా చేశారు. గురువారం షర్మిల 17 కిలోమీటర్లు నడవనుంది. షర్మిల పాదయాత్ర మహబూబ్ నగర్ జిల్లాలో కొనసాగుతోంది. అనంతరం ఆమె పాదయాత్ర రంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశిస్తుంది.

English summary
YSR Congress party chief YS Jaganmohan Reddy sister Sharmila has wept on Thursday at Nettempadu Project after seeing late YSR Rajasekhar Reddy's statue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X