వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాజీ ప్రధానమంత్రి ఐకె గుజ్రాల్ కన్నుమూత

By Srinivas
|
Google Oneindia TeluguNews

IK Gurjal
న్యూఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి ఐకె గుజ్రాల్ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న గుజ్రాల్ గూర్గాన్‌లోని మెడిసిటి మెదండా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఐకె గుజ్రాల్ పూర్తి పేరు ఇందర్ కుమార్ గుజ్రాల్. ఆయన 1997 ఏప్రిల్ నుండి 1998 మార్చి వరకు ఒక సంవత్సరంపాటు ప్రధానమంత్రిగా పని చేశారు. ఆయన 12వ ప్రధాని. 1919 డిసెంబర్ 4న జన్మించారు. ఆయన వయస్సు 93.

గుజ్రాల్ దివంగత ప్రధాని ఇందిరా గాంధీ మంత్రివర్గంలో సమాచార శాఖ మంత్రిగా, విపి సింగ్, దేవేగౌడ్ కేబినెట్లో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పని చేశారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. రష్యాలో భారత రాయబారిగా పని చేశారు. కొంతకాలంగా ఆయన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని వైద్యులు బుధవారం తెలిపారు. ఈ రోజు ఉదయం గూర్గాన్‌లో మృతి చెందాడు.

రాజ్యసభ నుండి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారిలో గుజ్రాల్ రెండోవారు. ఆయన కంటే ముందు హెచ్‌డి దేవేగౌడ రాజ్యసభ నుండి ప్రధానిగా పని చేశారు. కాంగ్రెసులో పని చేసి ఇందిరా గాంధీ కేబినెట్లో మంత్రిగా పని చేసిన గుజ్రాల్ ఆ తర్వాత జనతా దళ్‌ పార్టీలో చేరారు. గుజ్రాల్ 1989లో జలంధర్ నుండి లోకసభకు ఎన్నికయ్యారు. ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌ను గుజ్రాల్ వ్యక్తిగతంగా కలిశారు.

గుజ్రాల్ తనయుడు నరేష్ అగర్వాల్ శిరోమణి అకాలీదళ్ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. గుజ్రాల్ ఓ ఖచ్చితమైన సిద్ధాంతంతో ముందుకు వెళతారనే పేరు ఉంది. 1989లో శ్రీనగర్‌లో జరిగిన కిడ్నాప్ కేసును చేధించేందుకు విపి సింగ్ అప్పుడు గుజ్రాల్‌ను పంపించారు.

English summary
Former Prime Minister IK Gurjal was died on Friday morning in New Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X