బొట్టు ఎందుకు: విజయమ్మకు క్రైస్తవ సంఘాల ప్రశ్న

ప్రస్తుతం వైయస్ బాటలోనే విజయమ్మ నడుస్తున్నారని అన్నారు. ఆమె అసలైన క్రిస్టియన్ అయితే నుదుటన బొట్టు ఎందుకు పెట్టుకొంటారని ప్రశ్నించారు. చేతిలో బైబిల్ పట్టుకొని రాజకీయ సభలకు వెళ్లడం, పూజలు చేయడం తమ మతాన్ని అగౌరవపరచడమేనని తెలిపారు. క్రైస్తవులకు మేలు చేస్తానని చెబుతూనే వైయస్ రాజశేఖర్‌రెడ్డి చర్చిల స్థలాలను అక్రమించి తన కుటుంబానికి ఇచ్చారని వారు ఆరోపించారు. జగన్ కూడా క్రైస్తవులకు ఏమీ చేయలేదని, భవిష్యత్తులో చేసే అవకాశం లేదని కూడా వారన్నారు.
వైయస్ కుటుంబం తమకు ఇబ్బందిగా మారిందని అన్నారు. వైయస్ హయాంలో క్రైస్తవులకు వ్యతిరేకంగా వచ్చిన 746, 747 జీవోల వల్ల 600 మంది పాస్టర్లు జైలు పాలయ్యారన్నారు. పైగా ఆయన ఒక్క క్రైస్తవుడికి కూడా అసెంబ్లీ టిక్కెట్లు ఇవ్వలేదన్నారు. క్రిస్మస్‌ను రాష్ట్రపండుగగా ప్రకటించాలని, జనవరి 1ని ప్రభుత్వ సెలవుదినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
క్రైస్తవాన్ని వాడుకొని అవసరాలను తీర్చుకుంటున్నారే కానీ క్రైస్తవుల కోసం పార్టీలు ఏమీ చేయడంలేదని బిషప్ స్వామిదాస్ అన్నారు. బైబిల్ చేతిలో పట్టుకున్నంత మాత్రాన భక్తులు కాలేరని, పార్టీలు తమను వాడుకొని వదిలేస్తున్నాయని ఆయన అన్నారు. క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్‌ను పెట్టినా దానికి ఇప్పటివరకు చైర్మన్‌ను నియమించలేదన్నారు. కేసీఆర్, దేశపతి శ్రీనివాస్ సూర్యాపేట సభలో చేసిన వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వారు తమ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడంతో పాటు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రార్థనల పేరుతో బ్రదర్ అనిల్ లక్షలాది రూపాయాలు వసూలు చేశారని మక్తయ్య అన్నారు. ఆల్ ఇండియా ఇండిపెండెంట్ చర్చెస్ యూనియన్ జాతీయ అధ్యక్షులు బిషప్ ఆర్. హ్యారి సెబాస్టియన్, స్వామిదాస్, డేనియల్ ఆడమ్స్, తెలంగాణ క్రైస్తవ సంఘాల సమాఖ్యకు చెందిన జెరూసలెం మత్తయ్య తదితరులు మాట్లాడారు.












Click it and Unblock the Notifications