వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తేల్చేసిన జగన్ పార్టీ: చిరంజీవిపై చర్యకు డిమాండ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Balineni Srinivas Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అసలు విషయం బయట పెట్టింది. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై తీవ్రంగా ఒత్తిడి తెస్తున్న వైయస్సార్ కాంగ్రెసు తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ జైలు నుంచి వచ్చే వరకు తాము ప్రతిపాదించబోమని చెప్పేసింది. తమ పార్టీ అధ్యక్షుడు జగన్ జైలు నుంచి బయటకు వచ్చే వరకు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించబోమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాస రెడ్డి చెప్పారు.

కాంగ్రెస్‌లో విలీనం కావాలని లేదా ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాలన్న ప్రతిపాదనలు వచ్చాయని ఆయన అన్నారు. ఈ సమయంలో దేనిని అంగీకరించినా ఆత్మహత్యా సదృశమే అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆయన ఆదివారం శాసనసభ లాబీల్లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగాలని కోరుకుంటున్నామని ఆయన అన్నారు.

ఒకవేళ లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు వస్తే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొడతామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలతో కలసి గవర్నర్ వద్ద పెరేడ్ పెడతామని చెప్పారు. దీని వల్ల కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం విశ్వాస పరీక్షకు సిద్ధం కావాల్సి వస్తుందని అన్నారు. ఇది జరిగితే ప్రభుత్వం కూలిపోతుందన్నారు.

సమావేశాలు జరుగుతోన్న సమయంలో నిబంధనలు ఉల్లంఘించి అసెంబ్లీ ఆవరణలో మీడియా సమావేశం నిర్వహించిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవిపై చర్యలు తీసుకోవాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు స్పీకర్‌ను డిమాండ్ చేశారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్.ప్రసన్నకుమార్‌రెడ్డి, గుర్నాథ్‌రెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, కాపు రామచంద్రారెడ్డిలతో కలిసి శ్రీకాంత్ రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడారు.

అసెంబ్లీ సాగుతున్న సమయంలో ఎవరూ మీడియా సమావేశాలు పెట్టవద్దన్న నిబంధనలున్నాయని, కానీ అధికార పార్టీవారే ఆ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. శాసనసభ నిబంధనలను ఉల్లఘించిన చిరంజీవిపై చర్య తీసుకోవాలంటూ స్పీకర్‌కు వారు వినతిపత్రం ఇచ్చారు.

English summary
YSR Congress party MLA Balineni Srinivas Reddy said that they will not propose no confidence motion against CM Kiran kumar Reddy government till their president YS Jagan will released.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X