హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌కు ఝలక్, కిరణ్‌కు షాక్: చక్రం తిప్పిన బాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికా బిల్లుపై చివరి నిమిషంలో చక్రం తిప్పి అధికార కాంగ్రెసు పార్టీకి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి షాక్ ఇచ్చింది. బిల్లు ప్రవేశ పెట్టి క్రెడిట్ కొట్టేయాలన్న అధికార కాంగ్రెసుకు ఆ ఆనందం లేకుండా చేసింది. మరోవైపు జగన్ పార్టీకి తమ ముగ్గులోకి లాగి ఓ వర్గానికి వైయస్సార్ కాంగ్రెసు కూడా వ్యతిరేకమనే భావనను కలిగించిందని అంటున్నారు. కాంగ్రెసు ఈ బిల్లు తీసుకు వచ్చిందే మాదిగ, మాల వర్గాలను తమ వైపుకు తిప్పుకునేందుకు.

ఈ రెండు వర్గాలలో ప్రస్తుతం మాదిగ సామాజికవర్గం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండగా.. మాల సామాజిక వర్గం వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఫేవర్‌గా ఉంది. వారిని తమ వైపుకు తిప్పుకునేందుకు ప్రభుత్వం ఈ బిల్లును కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకు వచ్చింది. అయితే పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సూచనలతో టిడిపి నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లుగా కనిపిస్తోంది.

బిల్లు వీజీగా పాస్ అవుతుందని భావించిన తరుణంలో టిడిపి ఒక్కసారిగా బిల్లులోని 12వ క్లాజు సవరణకు డిమాండ్ చేసింది. నిధులు జనాభా ప్రాతిపతికన ఖర్చు చేయాలని కోరింది. దీనికి మిగిలిన ప్రతిపక్షాలు అండగా నిలువగా వైయస్సార్ కాంగ్రెసు మొదట మద్దతు పలకనప్పటికీ తీవ్ర తర్జన భర్జన అనంతరం టిడిపి బుట్టలో పడక తప్పలేదు. అయితే టిడిపి వ్యూహంలో ఇటు వైయస్సార్ కాంగ్రెసుకు, అటు కాంగ్రెసులకు ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పవచ్చు.

అధికార పార్టీ కాంగ్రెసుకు వ్యతిరేకమని మాదిగ సామాజికవర్గంలో మరింత ధృడంగా నిలిచిపోయింది. అదే సమయంలో బిల్లు సాఫీగా పాస్ అవుతుందనుకుంటే ఆ క్రెడిట్‌లో టిడిపికే ఎక్కువ లబ్ధి చేకూరుంది. మరోవైపు ఇన్నాళ్లూ మాల సామాజిక వర్గం జగన్ పార్టీకి అనుకూలంగా ఉంది. ఇప్పుడు వర్గీకరణకు జగన్ పార్టీ కూడా ఒకే చెప్పడంతో మాలలు ఈ పార్టీపై తమ అసంతృప్తిని వ్యక్తపరిచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

ముందు ముందు వర్గీకరణకు అనుకూలంగా ఉన్నందుకు టిడిపిని మాల వర్గం ఎంతగా వ్యతిరేకిస్తుందో జగన్ పార్టీని అంతే వ్యతిరేకించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కాంగ్రెసుకు వారు మద్దతిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. టిడిపి బలంగా వర్గీకరణకు డిమాండ్ చేస్తుండటంతో మాదిగలు అనుకూలంగా ఉన్నారు. ఇప్పుడు కొత్తగా వైయస్సార్ కాంగ్రెసు ఆ వాదన గట్టిగా వినిపించలేదు. అలా అని ఖండించలేదు. దీంతో మాదిగలు అనుకూలంగా మారే పరిస్థితి లేదంటున్నారు.

English summary
Telugudesam party has gain more than Congress and YSR Congress by Sc, ST sub plan bill.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X