నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబాయ్‌తో వచ్చి: బాబునికల్సిన ఎర్రన్నాయుడి కొడుకు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
నిజామాబాద్: దివంగత తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కింజారపు ఎర్రన్నాయుడు తనయుడు కింజారపు రామ్మోహన్ నాయుడు సోమవారం టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును కలిశారు. రామ్మోహన్ నాయుడు తన చిన్నాన్న అచ్చెన్నాయుడు కూడా వెంట వచ్చారు. వీరి భేటీలో రామ్మోహన్ నాయుడు రాజకీయ భవిష్యత్తు చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అచ్చెన్నాయుడు సోదరుడి కుమారుడికి అండగా ఉండనున్నారు.

కాగా ఎర్రన్నాయుడు రాజకీయ వారసుడిగా ఆయన తనయుడు రామ్మోహన్ నాయుడు దాదాపు ఇప్పటికే ఖరారయ్యారు. శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీలో ఎర్రన్నాయుడు ఉన్నన్నాళ్లూ ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన మృతి తర్వాత ఆయన రాజకీయ వారసుడిగా ఆయన తనయుడు, సోదరుడు... ఇలా పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. ఆ తర్వాత రామ్మోహన్ నాయుడు తాను రాజకీయ ఆరంగేట్రం చేస్తున్నట్లు ప్రకటించారు.

పార్టీ కూడా ఆయన రాజకీయ వారసుడిగా రామ్మోహన్ నాయుడును ఎంపిక చేసింది. శ్రీకాకుళం లోకసభ స్థానం నుండి రామ్మోహన్ నాయుడును నిలపాలని పార్టీ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఎర్రన్నాయుడు కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు పార్టీ ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లాలోనే కాకుండా రాష్ట్ర తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరించిన ఎర్రన్నాయుడు ఈ నెలలో మృతి చెందిన విషయం తెలిసిందే.

ఆయన మృతి తర్వాత శ్రీకాకుళం జిల్లా టిడిపిలో రాజకీయ వారసుడి కోసం తీవ్ర చర్చ సాగింది. ఇప్పుడు శ్రీకాకుళం స్థానం నుండి రామ్మోహన్ నాయుడును రంగంలోకి దింపాలని పార్టీ నిర్ణయించుకుంది. ఇక పార్టీ పోలిట్ బ్యూరోలోకి జిల్లా నుండి ఎవరిని తీసుకుంటారనే అంశం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. పార్టీ సీనియర్ నేతలు పోలిట్ బ్యూరోపై ఆశలు పెట్టుకున్నారు.

English summary
Telugudesam Party leader Yerram Naidu's son Rammohan Naidu has met TDP chief Nara Chandrababu Naidu on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X