వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేబినెట్‌ది తప్పు: ధర్మాన అంశంపై గవర్నర్‌కు కెకె లేఖ

By Srinivas
|
Google Oneindia TeluguNews

K Keshav Rao
హైదరాబాద్: మాజీ రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత కె కేశవ రావు మంగళవారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌కు లేఖ రాశారు. రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద రావు రాజీనామా అంశంపై రాజ్యాంగ బద్దంగా వ్యవహరించాలని ఆ లేఖలో సూచించారు. ధర్మాన వ్యవహారంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించవద్దని విజ్ఞప్తి చేశారు.

కాగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుకు సంబంధించి వాన్ పిక్ అంశంలో ధర్మాన ప్రసాద రావుకు అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు నోటీసులు అందుకున్న విషయం తెలిసిందే. జగన్ కేసులో ధర్మానతో సహా ఆరుగురు మంత్రులు నోటీసులు అందుకున్నారు. ఇందులో వాన్ పిక్ కేసులో మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ ఇప్పటికే జైలులో ఉన్నారు.

జగన్ కేసులో ధర్మాన ప్రసాద రావు, పొన్నాల లక్ష్మయ్యలు పలుమార్లు సిబిఐ ముందు హాజరయ్యారు. కేసుకు సంబంధించి ధర్మాన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కొద్ది రోజుల క్రితం రాజీనామా సమర్పించారు. అయితే ఆయన రాజీనామాను మంత్రివర్గం తిరస్కరిస్తూ, సిబిఐ విచారణకు నో చెబుతూ నిర్ణయం తీసుకుంది. దీనిని ముఖ్యమంత్రి ఆ తర్వాత గవర్నర్ నరసింహన్‌కు పంపించారు.

మంత్రివర్గంలో డిఎల్ రవీంద్రా రెడ్డి మినహా అందరూ ధర్మానను సిబిఐ విచారణకు ఇచ్చే అంశాన్ని తిరస్కరించారు. డిఎల్ మాత్రం సిబిఐ విచారణకు ఆదేశించాలని చెప్పారు. ఇదే విషయాన్ని డిఎల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీ మాథ్యూ, గవర్నర్ నరసింహన్‌ను కలిసి చెప్పారు. ధర్మాన సిబిఐ విచారణను కేబినెట్ తిరస్కరించిన కేబినెట్ నిర్ణయాన్ని కెకె తప్పు పడుతూ రాజ్యాంగ బద్ద నిర్ణయం తీసుకోవాలని గవర్నర్‌కు లేఖ రాశారు.

English summary
Former Rajyasabha Member and Congress party senior leader K Keshav Rao on Tuesday wrote a letter to governor Narasimhan about minister Dharmana Prasad Rao issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X