వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దిగొచ్చిన కేంద్రం: తెలంగాణపై ఈ నెల 28న అఖిలపక్షం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telangana Map
న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుల కృషి ఫలించింది. తెలంగాణపై తేల్చితేనే తాము చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డిఐ)పై ఓటింగుకు హాజరవుతామని ఎంపీలు పట్టుబట్టడంతో కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది. అఖిల పక్షానికి హామీ ఇచ్చింది. తేదీని కూడా ప్రకటించింది. ఈ నెల 28వ తేదిన అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రకటించారు.

అయితే గతంలో అఖిల పక్ష సమావేశానికి పార్టీకి ఇద్దరు చొప్పున పిలిచారు. ఒకరు తెలంగాణకు అనుకూలంగా మరొకరు సమైక్యాంధ్రకు అనుకూలంగా నిర్ణయాన్ని చెప్పారు. ఒక్క పార్టీలో రెండు అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో అది ఎటూ తేలకుండా పోయింది. మరి ఈసారి ఒక్కరిని పిలుస్తారా లేక ఇద్దర్ని పిలుస్తారా చూడాలి. ఒక్కరిని పిలిస్తేనే తెలంగాణ అంశం కొద్దిగాముందుకు కదిలినట్లు. మళ్లీ ఇద్దర్ని పిలిస్తే మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. అయితే ఈసారి ఒక్కర్ని పిలిచే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి.

కాగా అఖిల పక్ష సమావేశ నిర్ణయంపై తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు స్పందించారు. కేంద్రం నిర్ణయం కేవలం ఎఫ్‌డిఐని గట్టెక్కించేదిగా కనిపిస్తోందని అలా అయితే మాత్రం ప్రజలు కాంగ్రెసును తిప్పి కొడతారన్నారు. నిజంగానే 28న అఖిల పక్షాన్ని ఏర్పాటు చేస్తే ఆహ్వానించదగ్గ పరిణామమే అన్నారు. దీంతో టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల నిజ స్వరూపం బయటపడుతుందన్నారు.

పార్టీలు నాన్చుడు ధోరణి, దాగుడు మూతలు కాకుండా అనుకూలమో వ్యతిరేకమో చెప్పాలని డిమాండ్ చేశారు. మిగతా పార్టీల కంటే ముందు కాంగ్రెసు పార్టీ తన వైఖరిని తెలియజేయాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో ఏకాభిప్రాయం వచ్చే వరకు తాము ఏం చేయలేమని కేంద్రం ఇప్పటికే చెప్పిందని, ఆ ఏకాభిప్రాయం కోసం ఇప్పుడు అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తోందన్నారు.

English summary
Central Home Minister Sushil Kumar Shinde said that centre is ready to all party meeting on 28th of this month about Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X