అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఖైదీలకు పని: ఔషధ మొక్కలతో జైళ్లు హరితం

By Pratap
|
Google Oneindia TeluguNews

Jail inmates grow herbs for drug major
హైదరాబాద్: రాష్ట్రంలో బహిరంగ జైళ్లు ఔషధ మొక్కలతో హరితం కానున్నాయి. ఖైదీలకు పునరావాసం కల్పించే కార్యక్రమంలో భాగంగా అధికారులు బహిరంగ జైళ్లలో వారిచేత ఆయుర్వేద వైద్యానికి అవసరమైన ఔషధ మొక్కలు చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకుగాను, జైళ్ల శాఖ ఆయుర్వేద మందుల్లో ప్రముఖ పాత్ర వహిస్తున్న హిమాలయ డ్రగ్ కంపెనీతో అవగాహన పత్రంపై సంతకాలు చేసింది.

హిమాలయ కంపెనీతో కుదుర్చుకున్న అవగాహనా పత్రంపై అప్పటి జైళ్ల డైరెక్టర్ జనరల్, ప్రస్తుత హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ టిపి దాస్ ఈ ఏడాది జులైలో సంతకం చేశారు. హెర్బల్ హెల్త్‌కేర్ కంపెనీ సహకారంతో అనంతపురంలోని ఓపెన్ జైలులో ఆగస్టులో ఔషధ మొక్కల సాగు ప్రారంభమైందని, జైలు సూపరింటిండెంట్ ఎస్ లక్ష్మీపతి ఓ వార్తా సంస్థ ప్రతినిధితో చెప్పారు.

ప్రస్తుతం రెండు ఎకరాల్లో మాత్రమే సాగు ప్రారంభమైందని, తర్వాత మరో నాలుగు ఎకరాలను కూడా సాగులోకి తెచ్చామని, మొత్తం ఆరు ఎకరాల్లో ఔషధ మొక్కల పెంపకం జరుగుతోందని చెప్పారు. ఔషధ మొక్కల పెంపకానికి నీరు, విద్యుత్ సరఫరా వంటి మౌలిక సదుపాయాలను జైలు అధికారులు సమకూరుస్తుండగా, డ్రగ్ కంపెనీ విత్తనాలు సరఫరా చేస్తోంది.

డ్రగ్ కంపెనీ విత్తనాలను సరఫరా చేయడంతో పాటు సాంకేతిక సహకారాన్ని కూడా అందిస్తోందని లక్షీపతి చెప్పారు. ఖైదీలు ఆల్ఫాఆల్ఫాను వేశారని, ఇది ఏ సీజన్‌లోనైనా పెంచవచ్చునని, స్వల్ప వ్యవధిలోనే ఎక్కువ దిగుబడి వస్తుందని ప్రాజెక్టు ఇంచార్జీ, జైలర్ వెంకటేశ్వర రావు చెప్పారు. ఇది ఏడాదికి ఎనిమిది సార్లు దిగుబడి సాధిస్తుందని అన్నారు. మొదటి పంటను హిమాలయ కంపెనీ కొనుగోలు చేసిందని, రెండో పంట కోయడానికి సిద్ధంగా ఉందని చెప్పారు.

English summary
Inmates lodged in Andhra's open prisons are going herbal. With a view to rehabilitate prisoners, authorities have roped in inmates in the cultivation of herbal plants required for ayurvedic medicines. The Department of Prisons has signed a Memorandum of Understanding (MoU) with ayurvedic major Himalaya Drug Company to utilize services of inmates of open prisons to cultivate herbs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X