వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ.. మోడీ.. మోడీ..: మనకే కాదు అమెరికాకీ ఫీవర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/అహ్మదాబాద్: రాజకీయ నాయకుల్లో ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి నోళ్లలో నానుతున్న వ్యక్తి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ. అందుకు కారణం గుజరాత్ ఎన్నికలు ఒక్కటి మాత్రమే కాదు. 2002 గోద్రా అల్లర్లూ ఓ కారణమే. వరుసగా రెండు పర్యాయాలు గుజరాత్‌ను ఏలిన మోడీ మూడోసారి ముచ్చటగా గెలిచి తద్వారా 2014 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానమంత్రి కావాలని ఆశపడుతున్నారు.

మోడీ..మోడీ..మోడీ..: అమెరికాకీ ఫివర్

2002 నాటి గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో మోడీకి వీసా నిరాకరణను కొనసాగించాలని అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌కు అమెరికన్ కాంగ్రెసు సభ్యులు లేఖ రాశారు. అమెరికా మోడీకి గతంలో వీసాను నిరాకరించింది. ఇటీవల గుజరాత్‌లో మోడీ హవా కొనసాగే అవకాశాలు ఉండటంతో వీసా నిరాకరణపై పునరాలోచిస్తామని అమెరికా ప్రకటించింది. దీంతో తాజాగా వారు హిల్లరీకి వీసా ఇవ్వవద్దని కోరారు. విదేశాల్లోని భారతీయులు పలువురు మోడీకి వీసా నిరాకరించడాన్ని అప్పట్లో వ్యతిరేకించారు. ఇప్పటికీ కూడా చాలామంది వ్యతిరేకిస్తున్నారు. అయితే మోడీ చేసిన అభివృద్ధిని మాత్రం విదేశాలు కూడా తీసిపారేయలేకపోతున్నాయి.

మోడీ..మోడీ..మోడీ..: అమెరికాకీ ఫివర్

గుజరాత్‌తో సంబంధాలు తెంపుకున్న బ్రిటన్ కూడా మోడీ హవాకు తలొగ్గింది. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలోని తమ బ్రిటిష్ హై కమిషనర్‌కు అహ్మదాబాద్ వెళ్లమని, మోడీతో చర్చించమని సూచించింది. దీంతో అతను మోడీ వద్దకు వెళ్లి చర్చించారు. గుజరాత్‌తో సంబంధాలు ఏర్పర్చుకుంటామని చెప్పారు.

మోడీ..మోడీ..మోడీ..: అమెరికాకీ ఫివర్

గుజరాత్ ముస్లిం ఓటర్లు మోడీ వైపే మొగ్గు చూపుతున్నారు. దేశం, ప్రపంచం గోద్రా ఘటనను మర్చిపోలేకపోతున్పప్పటికీ గుజరాత్ ముస్లింలు మాత్రం మోడీ తప్ప తమకు మరో ప్రత్యామ్నాయం కనిపించడం లేదంటున్నారు. మోడీ గుజరాత్ అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నారని, గత ప్రభుత్వాల్లో కంటే మోడీ హయాంలోనే తమ వర్గం రాష్ట్రంలో బాగా ఉందని ముస్లిం వర్గాలు భావిస్తున్నాయట. అంతేకాదు దేశంలోని ఏ ఇతర రాష్ట్రాల్లో కంటే గుజరాత్ ముస్లిం జీవనమే బాగుందని ఓ సర్వే కూడా తెలిపింది.

మోడీ..మోడీ..మోడీ..: అమెరికాకీ ఫివర్

వ్యక్తిగత ప్రతిష్ట పెరిగి ప్రధాని రేసులో నిలబడటంతో బిజెపిలోని ఓ వర్గం కూడా మొదట నరేంద్ర మోడీని టార్గెట్‌గా చేసుకుంది. అయితే ఆ తర్వాత ఒక్కరొక్కరుగా పార్టీలోని నేతలు ఆయనకు మద్దతు ప్రకటిస్తున్నారు.

మోడీ..మోడీ..మోడీ..: అమెరికాకీ ఫివర్

మోడీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని ఎన్డీయే భాగస్వామ్య పక్షం జెడి(యు) నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వ్యతిరేకించారు. అయితే ఆయన కొద్ది రోజుల క్రితం వరకు ప్రధాని రేసులో ఉన్నారు. కానీ ఇటీవల ఆయన పేరు వినిపించడం లేదు. సుష్మా స్వరాజ్, అద్వానీ తదితరుల పేర్లు కూడా వినిపించాయి. అయితే నితీష్ మినహా ఇప్పుడు అందరూ మోడీకి మద్దతు పలుకుతున్నారు. మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే జెడి(యు) ఎన్డీయే నుండి బయటకు వెళ్లే అవకాశం ఉంది. నితీష్ ఆ దిశలో ఇప్పటికే హెచ్చరించారు.

మోడీ..మోడీ..మోడీ..: అమెరికాకీ ఫివర్

గోద్రా అల్లర్ల ఘటనలో మోడీని మరింత అప్రతిష్ట పాలుచేసేందుకు, ఆయన స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు కాంగ్రెసు వ్యూహాత్మకంగా ఆయన పైన గోద్రా అల్లర్లకు సంబంధించిన కేసులో సస్పెన్షన్‌కు గురైన ఐఏఎస్ అధికారి సంజీవ్ భట్ సతీమణి శ్వేతా భట్‌ను బరిలోకి దింపనున్నారు.

మోడీ..మోడీ..మోడీ..: అమెరికాకీ ఫివర్

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇటీవల ప్రకటించిన నగదు బదలీ పథకం కూడా నరేంద్ర మోడీ నుండి ఆ రాష్ట్ర ప్రజల దృష్టిని మరల్చేందుకే. తద్వారా ఓట్లను కొల్లగొట్టవచ్చని భావించింది.

మోడీ..మోడీ..మోడీ..: అమెరికాకీ ఫివర్

బిజెపి నుండి బయటకు వెళ్లి కొత్త పార్టీ పెట్టుకున్న కేశూభాయ్ పటేల్ ముఖ్యమంత్రికి సవాల్ విసురతున్నారు. మోడీనే విజయం వరిస్తుందని సర్వేలు చెబుతున్నప్పటికీ కేశూభాయ్ కొంత దెబ్బ తీయడం మాత్రం ఖాయం. దీంతో విజయం పైన కాకపోయినా మెజార్టీ పైన తప్పకుండా ప్రభావం పడుతుంది.

మోడీ..మోడీ..మోడీ..: అమెరికాకీ ఫివర్

2014 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెసు ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఆయనకు ధీటైన అభ్యర్థి దేశంలో నరేంద్ర మోడీ తప్ప మరెవరూ లేరని ఎక్కువ మంది భావిస్తున్నారు.

మోడీ..మోడీ..మోడీ..: అమెరికాకీ ఫివర్

మంగళవారం పార్లమెంటులో కూడా మోడీ లొల్లి చోటు చేసుకుంది. తెహెల్కా మ్యాగజైన్‌లో ప్రచురించిన కథనాన్ని ఆధారం చేసుకొని కాంగ్రెసు విమర్శలు చేసింది. ఆ మ్యాగజైన్ గ్యాస్ ఒప్పందంలో అక్రమాలు జరిగాయని రాసింది.

గుజరాత్‌ను మోడి ఎంతగా అభివృద్ధి చేసినా ఆయనను గోద్రా అల్లర్ల అంశం మాత్రం వీడటం లేదు. మోడీని విమర్శించేందుకు ప్రతిపక్షాలకు గోద్రా తప్ప మరో ప్రధానమైన అంశం కనిపించదు. పదేళ్లలో గుజరాత్‌ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి భారత అత్యుత్తమ ముఖ్యమంత్రులలో మొదటి స్థానంలో నిలిచారు. తన హయాంలో ఆయన ఏ రంగాన్ని విస్మరించలేదు. వ్యవసాయ, పారిశ్రామిక, క్రీడా.. ఇలా అన్ని రంగాలపై ఆయన దృష్టి సారించారు.

అందువల్లే గుజరాత్ ప్రజలు ఆయన వైపు మొగ్గు చూపుతున్నారు. కేశూభాయ్ పటేల్ రాష్ట్ర బిజెపిని వీడి కొంత క్యాడర్‌ను తన వెంట తీసుకు వెళ్లినప్పటికీ మోడీ హవా తగ్గలేదు. ప్రజలు ఎక్కువ మంది మోడీ వైపే చూస్తున్నారు. ముస్లిం వర్గాలు కూడా మోడీకే జై కొట్టడం విశేషం. ఆయన హయాంలోనే తమ జీవన శైలి అద్భుతంగా ఉందని.. ఉంటుందని వారు గట్టిగా నమ్ముతున్నారు. సర్వేలు కూడా మోడీ మళ్లీ మూడోసారి పగ్గాలు చేపడతారని చెబుతున్నాయి.

గుజరాత్ ముఖ్యమంత్రి అయిన నరేంద్ర మోడీకి దేశవ్యాప్తంగా పెద్ద మొత్తంలో అభిమానులు ఉండటం విశేషం. గుజరాత్ ప్రజలే కాకుండా దేశంలోని పెక్కుమంది మోడీ ప్రధానిగా ఉండాలని కోరుకుంటున్నారు. ఆయన తన ముందుచూపు, ప్రణాళిక, మంచి నిర్ణయాలతో గుజరాత్‌ను స్వల్పకాలంలో అభివృద్ధి చేసినట్లుగా ప్రధాని అయితే భారత్‌ను కూడా అన్ని రంగాలలో ముందుంచుతారని విశ్వసిస్తున్నారు.

మరో ముఖ్య విషయమేమంటే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అభ్యర్థిత్వానికి సొంత పార్టీ నుండే వ్యతిరేకత వ్యక్తమయింది. అయితే అదే సమయంలో ఇటీవల ఆయనకు మద్దతు పెరుగుతోంది. మొదట బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రధాని అభ్యర్థి బరిలో నిలిచినప్పటికీ సొంత రాష్ట్రంలోనే ఆయన ఇటీవల ప్రజల నుండి విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆయన పేరు ఇటీవల కాలంలో ప్రధాని రేసులో వినిపించడం లేదు.

English summary
All the surveys are showing Narendra Modi will form government in Gujarat third time. Gujarat Muslims also supporting Narendra Modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X