అంతకు తెగించారు: విజయమ్మ, షర్మిలలపై పితాని

Pitani Satyanarayana
ఏలూరు: భర్తగా, తండ్రిగా చెప్పుకుంటూ వైయస్ రాజశేఖర రెడ్డిని కూడా మార్కెట్ చేయడానికి వైయస్ విజయమ్మ, షర్మిల తెగించారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణ దుయ్యబట్టారు. కాంగ్రెసులో క్రమశిక్షణ గల నేతగా, ర్రాష్ట ముఖ్యమంత్రిగా వ్యవహరించి ప్రజల మేలు కోరి పనిచేసిన నేతగా వైయస్ రాజశేఖర రెడ్డి అందరి మదిలో ఉండిపోయారని, అయితే వైయస్ పేరునే ఇప్పుడు ఆయన భార్య విజయలక్ష్మి, కూతురు షర్మిలలు మార్కెటింగ్ చేస్తూ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారని మంత్రి ఆరోపించారు.

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో శుక్రవారం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైయస్సార్ కాంగ్రెసుపై తీవ్రంగా మండిపడ్డారు. దొంగ రాజకీయాలు నడిపే దొంగల పార్టీగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీని అభివర్ణించారు.

కాంగ్రెస్ అజెండానే తమ అజెండాగా చెప్పుకుంటారని, ఆ పథకాల్లేవు, ఈ పథకాల్లేవు అంటారని, అసలు వీరు చేసిందేమిటని, ఏ పథకాలు తెచ్చారు వీరు.. అసలు అజెండాయే లేని పార్టీకి వీరు నాయకులుగా మారారని పితాని దుయ్యబట్టారు. ఇప్పుడున్న పార్టీల్లో వైయస్సార్ కాంగ్రెసు దిక్కుమాలిన పార్టీ అని ఆయన వ్యాఖ్యానించారు.

అసెంబ్లీలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ బిల్లును ఆమోదించే విషయంలో విజయలక్ష్మి తెలుగుదేశంతో కుమ్మక్కయ్యారని, ఇంతకంటే నీతిమాలిన తనం ఏముంటుందని మంత్రి అన్నారు. ఇప్పటిదాకా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కయ్యారని విజయలక్ష్మి అబద్ధాలు చెబుతూ వచ్చారని, సబ్‌ప్లాన్ విషయంలో మాత్రం ఆమెతెలుగుదేశంతోనే కుమ్మక్కయ్యారని, ఇది బట్టబయలైందని ఆయన ఆరోపించారు. చంద్రబాబు మీకోసం యాత్రను ప్రజలు ఏ మాత్రం నమ్మే పరిస్థితుల్లో లేరని కూడా మంత్రి పితాని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+