• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఒత్తిడిలో బాబు: తప్పు చేస్తే శిక్ష తప్పదని వ్యాఖ్య

By Pratap
|
chandrababu Naidu
ఆదిలాబాద్: ఎఫ్‌డిఐలపై ఓటింగుకు రాజ్యసభలో ముగ్గురు ఎంపిలు దూరం కావడంపై వస్తున్న విమర్శలకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఒత్తిడికి గురైనట్లే కనిపిస్తున్నారు. దీంతో ఆయన ఆదివారం తన వస్తున్నా... మీకోసం పాదయాత్రలో పలు చోట్ల ఎఫ్‌డిఐల అంశాన్నే ప్రస్తావించారు. తప్పు చేస్తే శిక్ష తప్పదని ముగ్గురు వ్యవహారంపై వ్యాఖ్యానించారు. వారు పశ్చాత్తాప పడుతున్నారని చెప్పారు. చిల్లర వర్తకులను నట్టేట ముంచే ఎఫ్‌డీఐలకు తమ పార్టీ వ్యతిరేకమని చంద్రబాబు స్పష్టం చేశారు.

ఆదిలాబాద్ జిల్లాలో ఆదివారం ఆర్లి క్రాస్ రోడ్ నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించారు. కుంటాల క్రాస్ రోడ్, నందన్ క్రాస్‌రోడ్, నర్సాపూర్ (జి) క్రాస్‌రోడ్, చర్లపల్లి వరకు 11.5 కిలోమీటర్లు నడిచి 1100 కిలోమీటర్లు పూర్తి చేశారు. రాజ్యసభలో ఓటింగ్ జరిగిన సమయంలో తమ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు హాజరు కాలేకపోయారని, తాను ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి ఇప్పటికే 1100 కిలోమీటర్లకు పైగా నడిచానని, ఈ సమయంలో ఇలాంటి సంఘటనలు జరగడం తనకు తీవ్రమైన బాధ కలిగించిందని ఆయన అన్నారు.

అనారోగ్యం కారణంగా వెళ్లలేకపోయానని దేవేందర్ గౌడ్ ముందే చెప్పారని, మిగతా ఇద్దరూ (సుజనా చౌదరి, గుండు సుధారాణి) లిఖితపూర్వకంగా జరిగినదాన్ని తనకు వివరించారని, తప్పు చేశామంటూ పశ్చాత్తాపం వ్యక్తం చేశారని, తనకూ, పార్టీ కార్యకర్తలకూ క్షమాపణ చెప్పారని ఆయన అన్నారు. తాను ఈ విషయాన్ని పరిశీలిస్తున్నానని, ప్రలోభాలకు లోనయినట్టు తేలితే ఎవరినైనా క్షమించేది లేదనిస అదే సమయంలో తెలియక పొరపాటు జరిగి ఉంటే శిక్షించడం కూడా సరికాదని ఆయన అన్నారు.

ఒక ఎంపియో ఎమ్మెల్యేనో పోయినా ఫరవాలేదని, విలువలతో కూడిన రాజకీయం చేస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎదురు పార్టీలపై ఆయన విమర్శలు ఎక్కుపెట్టారు. రాష్ట్రాన్ని దోచుకున్న వారూ మమ్మల్ని విమర్శించే పరిస్థితికి వచ్చారని, జైల్లోఉండి కూడా ప్రణబ్‌కు ఓటు వేశారనిస ఇప్పుడు ఎఫ్‌డీఐలపై గైర్హాజరయ్యారని, ఆ పార్టీ వాడినని చెప్పుకునే అనకాపల్లి ఎంపీ (సబ్బం హరి) కాంగ్రెస్‌కు అనుకూలంగా ఓటేశారని ఆయన వైయస్సార్ కాంగ్రెసుపై నిప్పులు చెరిగారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస ముగ్గురు ఎమ్మెల్యేలను అమ్ముకుందనిస ఇలాంటి వాళ్లా మా గురించి మాట్లాడేదని ఆయన అన్నారు.

ఎన్టీఆర్ గానీ తాను గానీ నిప్పులా బతికామని, అందుకే ఎవరూ ఏమీ చేయలేకపోయారని అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పుట్టుకే అవినీతి పుట్టుక అని, అది రాష్ట్రాన్ని దోచుకున్న సొమ్ముతో ఏర్పటైన పార్టీ అని అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై ఆయన తీవ్రం ధ్వజమెత్తారు. అన్ని వర్గాల ప్రజలు కష్టాల పాలయ్యారని ఆయన అన్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

lok-sabha-home

English summary
Telugudesam party president N chandrababu Naidu in a pressure the affair three Rajyasabha members said that if they did fault, punshement will be given.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X

Loksabha Results

PartyLWT
BJP+0354354
CONG+09090
OTH19798

Arunachal Pradesh

PartyLWT
BJP33336
JDU077
OTH21012

Sikkim

PartyWT
SKM1717
SDF1515
OTH00

Odisha

PartyLWT
BJD10102112
BJP12223
OTH01111

Andhra Pradesh

PartyLWT
YSRCP0151151
TDP02323
OTH011

WON

Galla Jayadev - TDP
Guntur
WON
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more