తిరుపతి నుంచి తెలంగాణ మీదుగా కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్..! ఆ రోజు నుంచే..!
తిరుపతి-తెలంగాణ మధ్య రాకపోకలు సాగించేలా కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్ (Tirupati-Akola Weekly Express) రైలును దక్షిణ మధ్య రైల్వే ప్రారంభించబోతోంది. తిరుపతి నుంచి బయలుదేరి రాయలసీమ జిల్లాల మీదుగా తెలంగాణలోకి అడుగుపెట్టే ఈ రైలు మహారాష్ట్రలోని అకోలాకు వెళ్లనుంది. అలాగే అకోలా నుంచి తెలంగాణ మీదుగా తిరుపతికి ఇది ప్రయాణించబోతోంది. ఈ రైలు ప్రారంభ తేదీ, ఇతర వివరాలను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
ప్రతీ శుక్రవారం తిరుపతి నుంచి అకోలాకు వెళ్లే ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 17429 మే 8న ప్రారంభం కాబోతోంది. అలాగే ప్రతీ ఆదివారం అకోలా నుంచి తిరుపతికి వెళ్లే ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 17430 మే 3న ప్రారంభం కానుంది. ఈ రెండు రైళ్లకూ తెలుగు రాష్ట్రాల్లో పాకాల, పీలేరు, మదనపల్లె రోడ్, ములకలచెరువు, కదిరి, ధర్మవరం, అనంతపురం, డోన్, కర్నూలు, గద్వాల, వనపర్తి రోడ్, మహబాబ్ నగర్, కాచిగూడ, మేడ్చల్, కామారెడ్డి, నిజామాబాద్, బాసర స్టాప్ లు ఇచ్చారు.

ఈ రెండు రైళ్లకూ సెకండ్ ఏసీ, ధర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయి. ఈ రైళ్లు ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి తిరుపతి దర్శనానికి వచ్చే భక్తులకు, అలాగే తెలంగాణ నుంచి తిరుపతి వచ్చే భక్తులకు ఎక్కువగా ఉపయోగపడనున్నాయి. ఈ వీక్లీ ఎక్స్ ప్రెస్ ల రాకతో ఈ రూట్లలో రైళ్ల రద్దీ మరింత పెరగనుంది. కానీ ప్రయాణికుల రద్దీ మాత్రం తగ్గబోతోంది. దీంతో తిరుపతి వెళ్లే భక్తులకు ఊరట లభిస్తుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications