పేద విద్యార్ధులకు గుడ్ న్యూస్.. ఏటా రూ.48 వేలు స్కాలర్‌షిప్ ???

భారత ప్రభుత్వానికి చెందిన ప్రముఖ సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) 2026 సంవత్సరానికి సంబంధించి విద్యార్థులకు శుభవార్త అందించింది. ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉన్నత విద్యలో తోడ్పాటుగా భారీ సంఖ్యలో స్కాలర్‌షిప్‌లను ప్రకటించింది. మొత్తం 2000 స్కాలర్‌షిప్‌లతో ఈ పథకం దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు పెద్ద అవకాశం కానుంది.

స్కాలర్‌షిప్‌ల వివరాలు..

ఈ స్కీమ్‌లో మొత్తం 2000 స్కాలర్‌షిప్‌లు ఉండగా, అందులో 1000 ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు, 500 ఓబీసీలకు, మరో 500 జనరల్ కేటగిరీ విద్యార్థులకు కేటాయించారు. ముఖ్యంగా అన్ని కేటగిరీల్లో 50 శాతం స్కాలర్‌షిప్‌లను బాలికలకు రిజర్వ్ చేయడం విశేషం. ఇది మహిళా విద్యను ప్రోత్సహించే దిశగా కీలక అడుగుగా భావిస్తున్నారు.

oil-and-natural-gas-corporation-scholarship-to-poor-2000-students-for-the-year-2026

అర్హతలు - ఎవరు అప్లై చేయొచ్చు?

2025-26 విద్యా సంవత్సరంలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. బీఈ/బీటెక్, ఎంబీబీఎస్ వంటి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు, అలాగే ఎంబీఏ, జియాలజీ, జియోఫిజిక్స్ వంటి పీజీ కోర్సులు చదువుతున్నవారు అప్లై చేయవచ్చు.

  • ఇంజినీరింగ్, ఎంబీబీఎస్‌కు ఇంటర్మీడియట్‌లో కనీసం 60% మార్కులు తప్పనిసరి
  • పీజీ కోర్సులకు డిగ్రీలో 60% మార్కులు అవసరం

వయస్సు & ఆదాయ పరిమితి..

  • ఆగస్టు 1, 2025 నాటికి గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు
  • జనరల్, ఓబీసీ అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం ₹2 లక్షల లోపు ఉండాలి
  • ఎస్సీ/ఎస్టీలకు ఇది ₹4.5 లక్షల వరకు అనుమతించారు

ఇంకా, ఇతర ప్రభుత్వ లేదా ప్రైవేట్ స్కాలర్‌షిప్‌లు పొందుతున్నవారు ఈ పథకానికి అర్హులు కారు.

ఎంపిక ప్రక్రియ..

ఈ స్కాలర్‌షిప్‌ల కోసం ఎలాంటి రాత పరీక్ష ఉండదు. పూర్తిగా మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు:

ఇంజినీరింగ్, ఎంబీబీఎస్ విద్యార్థులకు ఇంటర్మీడియట్ మార్కులు

ఎంబీఏ, జియాలజీ, జియోఫిజిక్స్ విద్యార్థులకు డిగ్రీ మార్కులు

ఆర్థిక సహాయం..

ఎంపికైన విద్యార్థులకు నెలకు ₹4,000 చొప్పున అందిస్తారు. అంటే సంవత్సరానికి ₹48,000 ఆర్థిక సహాయం లభిస్తుంది.

ఇంజినీరింగ్, ఎంబీబీఎస్ విద్యార్థులకు 4 సంవత్సరాలు

ఎంబీఏ, జియాలజీ, జియోఫిజిక్స్ విద్యార్థులకు 2 సంవత్సరాలు

అయితే ప్రతి ఏడాది అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధిస్తేనే స్కాలర్‌షిప్ కొనసాగుతుంది.

కోర్సుల వారీగా కేటాయింపు..

  • ఇంజినీరింగ్: ఎస్సీ/ఎస్టీ - 500, ఓబీసీ - 300, జనరల్ - 300
  • ఎంబీబీఎస్: ఎస్సీ/ఎస్టీ - 90, ఓబీసీ - 50, జనరల్ - 50
  • ఎంబీఏ: ఎస్సీ/ఎస్టీ - 140, ఓబీసీ - 50, జనరల్ - 50
  • జియాలజీ/జియోఫిజిక్స్: ఎస్సీ/ఎస్టీ - 270, ఓబీసీ - 100, జనరల్ - 100

జోన్ వ్యవస్థ - రాష్ట్రాల విభజన

దేశాన్ని ONGC ఐదు జోన్‌లుగా విభజించింది. ప్రతి జోన్‌లో స్కాలర్‌షిప్‌లను సమానంగా పంపిణీ చేస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు జోన్-5 పరిధిలోకి వస్తాయి. విద్యార్థి చదువుతున్న కాలేజీ ఉన్న రాష్ట్రం ఆధారంగా జోన్ నిర్ణయిస్తారు.

దరఖాస్తు విధానం & చివరి తేదీ..

అర్హులైన అభ్యర్థులు నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ (NSP) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

చివరి తేదీ: మే 15, 2026

అదనపు ప్రయోజనాలు..

మెరిట్ ఆధారంగా ఎంపిక కావడం వల్ల పారదర్శకత

గ్రామీణ, పేద విద్యార్థులకు పెద్ద అవకాశంగా మారడం

మహిళా విద్యార్థులకు ప్రత్యేక ప్రోత్సాహం

ఉన్నత విద్యలో ఆర్థిక భారం తగ్గింపు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+