• search
  • Live TV
ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

వైయస్ లాంటివాడే జగన్, ఆదరించండి: విజయమ్మ

By Pratap
|
YS Vijayamma
ఆదిలావాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ స్వభావం దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డివంటిదేనని ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో జరిగిన బహిరంగ సభలో ఆమె సోమవారంనాడు ప్రసంగించారు. జగన్మోహన్ రెడ్డిని మీ బిడ్డగా ఆదరించాలని ఆమె ప్రజలను కోరారు. జగన్ అధికారంలోకి వస్తే రాజన్న పాలన వస్తుందని ఆమె అన్నారు.

ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా తెలంగాణను సస్యశ్యామలం చేయాలని వైయస్ రాజశేఖర రెడ్డి కలలు కన్నారని, ఆ ప్రాజెక్టు కోసం వైయస్ ఎంతో కృషి చేశారని చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత ఆ ప్రాజెక్టును కాంగ్రెసు ప్రభుత్వం పట్టించుకోలేదని ఆమె విమర్శించారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం వేగవంతంగా జరిగిందని చెప్పారు. ప్రస్తుతం నిర్మాణాలు ఆగిపోయే పరిస్థితి ఉందని ఆమె అన్నారు.

రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయని వైయస్ విజయమ్మ వ్యాఖ్యానించారు. గ్రామాల్లో రెండు గంటలు కూడా కరెంట్ ఉండడం లేదని అన్నారు. విద్యుత్ కోతలతో వేలాది పరిశ్రమలు మూతపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. విత్తనాల కొరతతో రైతులు ఇక్కట్లపాలవుతున్నారని అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ధాన్యానికి గిట్టుబాటు ధర ఇచ్చి రైతులను ఆదుకున్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం ధరలు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు.

ఉన్నతాశయంతో వైయస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టారని, ఇప్పుడు 108కి ఫోన్ చేస్తే డీజిల్ లేదనే సమాధానం వస్తోందని ఆమె అన్నారు. పేదలు ఉన్నత విద్యను అభ్యసించాలని వైయస్ ఫీజు రీయంబర్స్‌మెంట్‌ను ప్రవేశపెట్టారని, మైనారిటీలకు ఏ ముఖ్యమంత్రి ఇవ్వని విధంగా ఐదు శాతం రిజర్వేషన్ల కల్పించారని ఆమె గుర్తు చేశారు. పన్నులు వేయకుండా పాలన సాగించిన ఘనత వైయస్‌దేనని ప్రశంసించారు.

వస్తున్నా... మీకోసం పేరుతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బూటకపు పాదయాత్ర చేస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. రుణమాఫీ అంటూ రైతులను మోసం చేస్తున్నారని అన్నారు. గతంలో ఉచిత విద్యుత్ పథకాన్ని చంద్రబాబు ఎగతాళి చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. అధికారం కోసమే ఇప్పుడు ఉచిత విద్యుత్తు హామీ ఇస్తున్నారని విమర్శించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

ఆదిలాబాద్ యుద్ధ క్షేత్రం
సంవత్సరం
అభ్యర్థి పేరు పార్టీ లెవెల్ ఓటు ఓటు రేట్ ఓట్ల తేడ
2019
సోయం బాబూ రావు బీజేపీ విజేతలు 3,77,374 35% 58,560
నగేశ్ టిఆర్ఎస్ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 3,18,814 30% 58,560
2014
గోదం నగేష్ టిఆర్ఎస్ విజేతలు 4,30,847 42% 1,71,290
నరేష్ కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 2,59,557 25% 0

English summary
YSR Congress honorary president YS Vijayamma, addressing a public meeting at Nirmal of Adilabad district, said that her son and party president YS Jagan's nature is like late YS rajasekhar Reddy.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more