సిఎం హెలికాప్టర్ సహా ఆరు బుగ్గి: 'బేగంపేట'పై విచారణ

కిరణ్ ఆదేశాల మేరకు వెంటనే విచారణ ప్రారంభించింది. ఎస్పీస్థాయి నేతృత్వంలో విచారణ జరుగుతోంది. సిఐడి కంటే ముందు నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించారు. సిఐడి నేతృత్వంలో ప్రమాదం గురించి తెలుసుకునేందుకు క్లూస్ టీం, ఫోరెనిక్స్ నిపుణులు, పోలీసులు రంగంలోకి దిగారు. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రమాదంపై నివేదిక ఇచ్చేందుకు సిఐడి ప్రయత్నాలు చేస్తోంది. దర్యాఫ్తును ఏడిజి కృష్ణ ప్రసాద్ పర్యవేక్షిస్తున్నారు.
కాగా ఈ ప్రమాదంలో దాదాపు రూ.150 కోట్ల ఆస్తి బుగ్గిపాలై ఉంటుందని అంచనా వేస్తున్నారు. డ్రమ్ముల్లో ఫ్యూయల్ ఉండటంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ ఘటనలో ముఖ్యమంత్రి ప్రయాణించే అగస్టా వెస్ట్ లాండ్ హెలికాప్టర్ కూడా ఉంది. దీని ఖరీదు దాదాపు రూ.63 కోట్లు ఉంటుందని చెబుతున్నారు. అగస్టా హెలికాప్టర్‌కు పూర్తి స్థాయిలో ఇన్సురెన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు. ఇన్సురెన్స్ ఉన్నందున క్లెయిమ్ చేసుకుంటామని మంత్రి గంటా శ్రీనివాస రావు చెప్పారు.
ఇదీ అగస్టా.....
అగస్టా హెలికాప్టర్‌ను ప్రభుత్వ అధికారులు తెల్ల ఏనుగు అని ముద్దుగా పిలుచుకుంటారు. 2008లో రూ.63 కోట్లు వెచ్చించి దీనిని ఇటలీ నుంచి కొనుగోలు చేసింది ప్రభుత్వం. ముఖ్యమంత్రి, విఐపిల ప్రయాణంతో పాటు బహుళ ప్రయోజనాల కోసం సర్కారు దీనిని ఉపయోగిస్తోంది. ఎడబ్ల్యు-139 మోడల్ కు చెందిన అగస్టా వెస్ట్ లాండ్ హెలికాప్టర్ పైలట్, కోహైలట్‌తో సహా మొత్తం 15 మంది వరకు ప్రయాణించవచ్చు. గంటకు 257 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది. 505 నాటికల్ మైళ్లు నిర్విరామంగా ప్రయాణిస్తోంది.












Click it and Unblock the Notifications