ఎన్టీఆర్ నివాసం కూల్చివేత: లక్ష్మీ పార్వతి మండిపాటు

కూల్చి వేస్తున్న భవనాన్ని వెంటనే పునర్నిర్మించాలని ఆమె డిమాండ్ చేశారు. లేకుంటే తాను నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు. ఎన్డీఆర్ నడిచిన దేవాలయాన్ని కూల్చడం దారుణమన్నారు. ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ దుర్మార్గాన్ని ప్రజలు అందరూ గమనిస్తున్నారని ఆమె అన్నారు. తాను ఉండగా ఇంటి నిండా ఎన్టీఆర్ జ్ఞాపకాలతో నింపేసే దానిని అని చెప్పారు. ఎవరైనా వచ్చినప్పుడు వాటిని చూపిస్తూ గడిపేదాన్నన్నారు. తనను బలవంతంగా ఆ ఇంటి నుండి బయటకు గెంటి వేసి ఇప్పుడు దానిని కూల్చి వేయడం దారుణమన్నారు.
కాగా లక్ష్మీ పార్వతి ఇంటిని కోర్టు అధికారులు గత సంవత్సరం ఖాళీ చేయించారు. బంజారాహిల్స్‌లోని రోడ్ నెంబర్ 13లో ఈ ఇల్లు ఉంది. దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఉన్నప్పటి నుండి ఆమె అందులోనే ఉంటున్నారు. ఎన్టీఆర్ వీలునామా ప్రకారం ఆ ఇల్లు చిన్న కూతురు ఉమా మహేశ్వరికి దక్కింది. ఉమా మహేశ్వరి ఈ ఇంటి పవర్ ఆఫ్ అటార్నీని తన సోదరుడు రామకృష్ణకు ఇచ్చారు.
లక్ష్మీ పార్వతిచే ఇల్లు ఖాళీ చేయించాలంటూ రామకృష్ణ కోర్టును ఆశ్రయించారు. సిటీ సివిల్ కోర్టు ఇళ్లు ఖాళీ చేయాలంటూ లక్ష్మీ పార్వతిని ఆదేశించింది. అయితే ఇచ్చిన గడువులోగా ఆమె ఖాళీ చేయకపోవడంతో కోర్టు అధికారులు ఇంటిని ఖాళీ చేయించారు. ఇల్లు ఖాళీ చేయించేందుకు రామకృష్ణ వెళ్లారు. ఇళ్లు ఖాళీ చేయించడంపై లక్ష్మీ పార్వతి అప్పుడు మండిపడ్డారు.
-
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!!











Click it and Unblock the Notifications