వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ఎవరికి ఏ పదవో తెలియదు: జగన్ పార్టీలో లుకలుకలు'

By Srinivas
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో అధ్యక్షుడు ఎవరో, గౌరవాధ్యక్షుడు ఎవరో, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరో తెలియకుండా ఉందని, ఎవరు ఎప్పుడు ఏ పదవిలో ఉంటారో, ఎప్పుడు ఊడిపోతారో అంతుబట్టకుండా ఉందని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం అన్నారు. ఆ పార్టీ కార్యకర్మాలు, విధానాలు, ప్రణాళికలు ఏమిటో ఎవరికీ అర్థం కావన్నారు. పార్టీలో అన్నీ లుకలుకలే అన్నారు.

పార్టీ కార్యాలయాలు దేవాలయాలతో సమానమని.. కానీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎక్కడికి వెళుతున్నారో చూసుకోవాలని అన్నారు. చంచల్‌గూడ జైలుకు వెళ్లి కలవాల్సి వస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. వైయస్ జగన్ అధికారంలోకి వస్తే పేదలకు వడ్డీ లేని రుణాలిస్తాడంటూ షర్మిల పాదాయాత్రలో చెబుతున్నారని, మరి ఇప్పుడు రాష్ట్రంలో అమలవుతున్న పావలా వడ్డీ పథకం గురించి ఆమెకు అవగాహన లేనట్లుగా కనిపిస్తోందన్నారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పగటి వేషగాడిలా ఊరూరా తిరుగుతున్నారన్నారు. ఆయనకు సంస్కారం లేదని, ఎవరిని ఎలా సంభోధించాలో కూడా తెలియదన్నారు. మంత్రివర్గ సమావేశాన్ని జైలులో నిర్వహించుకునే రోజు వస్తుందనే మాటలు సరికాదన్నారు. తనపై ఆరోపణలు రాగానే చంద్రబాబు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటారన్నారు. విచారణ జరిగి ఉంటే అక్రమాలకు పాల్పడ్డారో లేదో తెలిసి ఉండేదన్నారు.

English summary

 PCC chief Botsa Satyanarayana has said that YSR Congress is in crisis.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X