బాలిక హత్య కేసులో కాంగ్రెసు ఎమ్మెల్యే: పరారీ

ఓ అమ్మాయి హత్య కేసులో శాసనసభ్యుడితో పాటు మరో ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌కు చెందిన జ్యోతి అనే అమ్మాయి పంచకులలో నవంబర్ 22వ తేదీన మరణించింది. ఆమె తలకు తగిలిన గాయాలతో మరణించినట్లు, ఇటీవలే ఆమెకు గర్భవిచ్ఛిత్తి జరిగినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది.
నిందితులను పట్టుకోకపోతే తాను కోర్టును ఆశ్రయిస్తానని బాలిక తండ్రి బూటీ రామ్ అంటున్నారు. పోలీసులు ఏమీ చేయడం లేదని, తాను కోర్టుకు వెళ్తానని ఆయన అన్నారు. మౌనం వహించడానికి తనకు డబ్బు ఇవ్వజూపినట్లు, అయితే తాను దాన్ని తిరస్కరించినట్లు రామ్ చెప్పారు.
చౌదరి హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్నారు. నాలుగు సార్లు శానససభ్యుడిగా పనిచేసిన నాయకుడి కుమారుడు కూడా. బద్దీలోని డూన్ నియోజకవర్గం నుంచి చౌదరి శాసనశభ్యుడిగా ఎన్నికయ్యారు. పోలీసులు అతని జాడ కనిపెట్టలేకపోతున్నారు.












Click it and Unblock the Notifications