వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విక్టిమ్‌కి దామినిగా పేరు: ఆందోళనపై షిండే అసహనం

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఢిల్లీ గ్యాంగ్ రేప్ బాధితురాలికి "దామిని" అని ఆందోళనకారులు పేరు పెట్టారు. కదిలే బస్సులో సామూహిక అత్యాచారానికి వైద్య విద్యార్థిని ప్రస్తుతం ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఈ వైద్య విద్యార్థినికి ఆందోళనాకారులు దామిని అనే పేరు పెట్టి, గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోరాడుతున్నారు.

అత్యాచారానికి గురైన వైద్య విద్యార్థిని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆమె పేరుతో పాటు ఇతరత్రా వివరాలను పోలీసులు వెల్లడించలేదు. దీంతో ఆందోళనకారులు ఆమెకు దామిని అనే పేరు ఆమెకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు. 1993లో దామిని సినిమా విడుదలైంది. ఇందులో అత్యాచారానికి గురైన ఓ మహిళ న్యాయం పోరాడినట్లు కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. అందుకే ఈ పేరును పెట్టినట్లు ఆందోళనకారులు చెబుతున్నారు. దామిని.. నీ కోసం.. మేమున్నామనే.. ప్లకార్డులతో సబ్దర్‌జంగ్ ఆస్పత్రి ముంగిట ఆందోళనకారులు నినాదాలు చేశారు.

కాగా, ఆందోళనకారులపై ప్రభుత్వం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. డిమాండ్లకు ఓ పరిమితి ఉంటుందని హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే మండిపడ్డారు. ఇండియా గేట్ వద్ద ఆదివారం ఆందోళనకారులపై పోలీసులు చేపట్టిన చర్యలను ఆయన సమర్థించారు. ప్రభుత్వం ఆందోళనకారుల డిమాండ్లను అంగీకరించడానికి సిద్ధంగా లేదని ఆయన స్పష్టమైన సంకేతాల ఇచ్చారు.

Delhi gangrape: Victim named after Damini

ఆందోళనకారుల వద్దకు వెళ్లి మాట్లాడాలని వచ్చిన డిమాండుపై షిండే తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులతో ఆందోళనకారులను పోలుస్తూ చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన సమర్థించుకున్నారు. శాంతిభద్రతల నుంచి దాన్ని వేరు చేసి చూడలేమని, దాని గురించి తాను ఇది వరకే మాట్లాడానని, ఆందోళన ప్రారంభించినప్పటి నుంచి తాను తన నివాసంలో వారిని కలిశానని, తన ఆఫీసులో కలిశానని, వారి ప్రతినిధులతో కూడా సమావేశమయ్యానని వివరించారు.

ఆందోళనకారుల్లోకి గూండాలు, అసాంఘిక శక్తులు ప్రవేశించినట్లు, అందుకే పోలీసులు కఠినంగా వ్యవహరించినట్లు ఆయన తెలిపారు. ఆ శక్తులు రాళ్లు విసురుతూ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే పనికి పూనుకున్నాయని, దాంతో పోలీసులు చర్యలు చేపట్టాల్సి వచ్చిందని ఆయన అన్నారు. రాష్ట్రపతి భవన్‌లోకి చొరబడుతామంటే సహించాలా అని ఆయన అడిగారు. ఇండియా గేట్ వద్ద జరిగిన హింసపై విచారణకు ఆదేశించినట్లు ఆయన తెలిపారు.

English summary
The Delhi gang rape victim has been named as Damini. There should be a limit on demands, thundered Union Home Minister Sushil Kumar Shinde on Monday as he justified police brutality on public at India Gate on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X