కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ మాఫియాను నడిపించాడు: చంద్రబాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
కరీంనగర్: వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో 117 సెజ్‌ల పేరిట 2.75 లక్షల ఎకరాలను ప్రజల నుంచి లాక్కొని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారని, ఒక్క హైదరాబాద్‌లోనే 8వేల ఎకరాలను ధారాదత్తం చేశారని తెలుగుదేశం అధ్యక్షుుడ చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కరీంనగర్ జిల్లా నర్సయ్యపల్లె నుంచి సోమవారం ఆయన పాదయాత్ర ప్రారంభించారు. మొత్తం 14.5 కిలోమీటర్లు నడిచారు. రాష్ట్రంలో మాఫియాలను తయారు చేసి ప్రైవేటు, ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారని విమర్శించారు.

తన హయాంలో ఐటీ కంపెనీలకు ఒక ఎకరా ఇస్తే వేయి ఉద్యోగాలు కల్పించాలని షరతు పెట్టామని, లక్షల ఎకరాలను ప్రైవేటు వారికి కట్టబెట్టినా ఇప్పుడు ఒక్క ఉద్యోగం కూడా రాలేదని విమర్శించారు. ఎపిఐఐసిని పావుగా చేసుకుని అధికార పార్టీ నేతలు నోటీసులు ఇచ్చి రైతుల భూములను లాక్కున్నారని, ఒక వాన్‌పిక్ కంపెనీకే 19 వేల ఎకరాలు ఇచ్చారని ఆరోపించారు.

కలెక్టర్లతో కాకుండా ప్రైవేటు వ్యక్తులతో భూసేకరణ చేయించి రైతులకు ఎకరాకు రూ.లక్ష ఇచ్చి, ఎకరా రూ.2-3 కోట్లకు అమ్ముకునేందుకు రంగం సిద్ధం చేశార న్నారు. ప్రజల నుంచి రూ.20 వేల కోట్ల ఆస్తులు లాక్కొని రెండుమూడు వందల కోట్లు మాత్రమే చెల్లించారన్నారు. చివరకు అసైన్డ్ భూములను కూడా స్వాధీనం చేసుకున్నారని విమర్శించారు.

పేదలకు వంద గజాల స్థలం ఇవ్వలేకపోగా ఒక్కరికే 20 వేల ఎకరాలు కట్టబెట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఎవడ బ్బ సొమ్మని ఎడాపెడా భూపందేరం చేస్తున్నారని దుయ్యబట్టారు. తప్పుడు రికార్డులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ధ్వజమెత్తారు. ఒక కాంగ్రెస్ నేత ఇంట్లో సభ్యత్వ పుస్తకాలున్నట్లు తెలిసి, మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ అక్కడకు వెళ్తే పోలీసులు దౌర్జన్యం చేశారన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు చెప్పారని అనుకూలంగా వ్యవహరించిన అధికారులు జైలుకు పోయారని, అలా చేసిన మం త్రి కూడా జైలులోనే ఉన్నారని అన్నారు.

చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల అరాచకం పెరిగిపోతున్నదని ఢిల్లీలో అత్యాచారం ఘటనను గుర్తుచేశారు. కేంద్రం లో, రాష్ట్రంలో అధికారంలో ఉండి, తెలంగాణ ఇచ్చే శక్తి ఉన్నా మళ్ళీమళ్ళీ అభిప్రాయం కోరడం టీడీపీని రాజకీయంగా దెబ్బతీసే ప్రయత్నంలో భాగమే'నని ఆరోపించారు.

English summary
Telugudesam party president N Chandrababu Naidu has lashed at YS Rajasekhar Reddy on acquisition pf lands from farmers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X